చంద్రబాబు మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నారా ?

అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు మరీ ఇంత చీప్ గా దిగజారిపోతారని ఎవరూ అనుకోలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అంటూ కథలు చెబుతూనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అవకాశం దొరికిచ్చుకుని మరీ చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి చీప్ ట్రిక్ ఒకటి బయటపడటంతో నెటిజన్లు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా ఇచ్చిన మాట తప్పటం గురించి చంద్రబాబు వ్యాఖ్యానించటమే ఇక్కడ విచిత్రం.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆశావర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చటం కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. అయితే ఈ మధ్యనే వాళ్ళ జీతాలను పది వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అయితే హామీ ఇచ్చిన తేదీ నుండి జీవో వచ్చే లోగానే ఆశా వర్కర్లు కొంత ఆందోళన చేశారు.

జీవో విడుదల కాగానే కొందరు ఆశా వర్కర్లు జగన్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. దాన్ని గమనించిన చంద్రబాబుకు కడుపుమండిపోయింది. వెంటనే అంతకుముందు ఆశావర్కర్లు జరిపిన దిష్టిబొమ్మ  శవయాత్రను, పాలాభిషేకం ఫొటోను తన ట్విట్టర్లో పెట్టారు. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాట తప్పతే జరగబోయే సన్మానం ఇదే అంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు.

ఇక్కడే జగన్ పై చంద్రబాబు అక్కసంతా బయటపడింది.  జగన్ ఫొటోకు పాలాభిషేకం చేస్తున్న ఫొటోనేమో జీతాలు పెంచిన తర్వాతదే అనటంలో సందేహం లేదు. కానీ శవయాత్ర ఫొటో మాత్రం అసలు ఏపిలోనిది కానేకాదు. నాలుగేళ్ళ క్రితం తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో కెసియార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశావర్కర్లు చేసిన నిరసన కార్యక్రమానిది. దాంతో ఎక్కడి ఫొటోనో తీసుకొచ్చి జగన్ పాలనకు వ్యతిరేకం అంటూ ట్విట్లర్లో పెట్టారంటూ చంద్రబాబుపై నెటిజన్లు మండిపోతున్నారు.