ప్రధాని మోదీ ఆంధ్రా ఎందుకు వస్తున్నారు?

 రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాని మోదీ హవా లేదు. అది తెలంగాణలో రుజువయింది.  ఆంధ్రలో కూడా అంతే. 2014 మోదీ వూపులో ఉన్నపుడు ఏదో కొంత ప్రయోజనం జరిగింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నందున నాలుగు సీట్లు గెల్చుకున్నారు. ఏంజరిగిందో ఏమో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మోదీ  మిత్ర ద్రోహి అనడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు.అసలు ఆంధ్రా కే చేసిన సాయమలే దుపొమ్మని మోదీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మోదీ ఆంధ్రలో బాగా అపకీర్తి పాలు చేస్తున్నారు. దీని ప్రభావం కొంతయిన తగ్గించకపోతే, 2019 ఎన్నికల్లో ఆంధ్రలో కూడా  బిజెపి ఒక సీటులకో నిల్ కో దిగజారే అవకాశం ఉంది. అందువల్ల ఆంధ్ర టూర్ చేసి కొంతయినా వాస్తవం చెప్పాలని ప్రధాని భావిస్తున్నారట. అందుకే ఆయన  జనవరి 6 న గుంటూరు వస్తున్నారు. ఈ రోజు విషయాన్ని  బిజెపి నాయకురాలు పురందేశ్వరి చెప్పారు.ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి తానెంతసాయం చేసింది చెప్పేందుకే ప్రధాని మోదీ ఆంధ్రా  వస్తున్నారని ఆమె చెప్పారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న గుంటూరు వస్తున్నారు. అక్కడ జరిగే ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. నాలుగున్నరేళ్లలో ఏపీకి కేంద్రం అనేక విధాలా సహకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచిఈ సాయం   అందడం లేదు. విభజన చట్టంలో హామీలను అమలు చేయడం లేదని అని అసత్య ప్రచారం చేస్తోంది. అందుకే ప్రజా చైతన్య సభ   ద్వారా  కేంద్రం రాష్ట్రానికి ఏం సాయం చేసింది వివరిస్తారు, ’ అని ఆమె అన్నారు.

‘‘పోలవరం ప్రాజక్టుకు కేంద్ర భారీగాసాయం చేసింది, పక్కా గృహాలకు నిధులందించింది, మరుగుదొడ్ల నిర్మాణం కేంద్ర పథకమే. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి  సాంకేతిక సమస్యలు ఎదురైనందున  ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం చూపించాలని కేంద్రం కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని పురందేశ్వరి విమర్శించారు.