కొడాలి నాని ప్రతాపమంతా నారా వారి మీదేనా ! నందమూరి వారంటే… భయమా ?

why kodali nani silent on balakrishna comments?

వైసీపీ మంత్రి కొడాలి నానికి నందమూరి ఫ్యామిలీతో ఉన్న బంధం చాలా గొప్పది. ఒకప్పుడు హరికృష్ణ వెన్నంటి ఉండే కొడాలి నానికి జూనియర్ ఎన్టీయార్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అక్షరాబ్యాసం చేసి ఎమ్మెల్యే గా కూడా గెలుపొందాడు. ఆ తర్వాత  అనూహ్యంగా ఆ పార్టీని వీడి వైస్సార్సీపీ లో జాయిన్ అయ్యారు. ఆయనకి రాజకీయ బిక్ష పెట్టిన చంద్ర బాబు నాయుడు మీద దారుణంగా విమర్శలు చేస్తూ టోటల్ నందమూరి ఫ్యామిలీకి దూరమవుతున్నారు.

why kodali nani silent on balakrishna comments?
why kodali nani silent on balakrishna comments?

హరిక్రిష్ణ తోడు నీడగా ఉండే కొడాలి నాని ఆయన మరణాంతరం జూనియర్ తో కూడా గతంలోలా రిలేషన్స్ మెయింటెయిన్ చేయడంలేదని చెబుతున్నారు. ఇక జూనియర్ సైతం కొడాలి నాని పట్ల మునుపటి ప్రేమాభిమానాలను చూపడంలేదని అంటున్నారు. కొడాలి నాని బోల్డ్ గా మాట్లాడడమే కాకుండా వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రిగా కొనసాగుతూండడంతో తనకు తన ఇమేజ్ కి అది డ్యామేజ్ అని తలచే జూనియర్ కొడాలి నానితో దూరం పాటిస్తున్నారు అన్నది ఒక టాక్.

ఇక గతంలో టీడీపీ సారధ్యాన్ని జూనియర్ అయినా బాలయ్య అయినా చేపట్టాలి అని కొడాలి నాని లాంటి వారు తరచూ అనేవారు. వైసీపీలో మంత్రిగా జగన్ కి అత్యంత సన్నిహితుడిగా నాని మారాక నందమూరి ఫ్యామిలీ కూడా ఆయన మీద గుస్సా అవుతోంది అంటున్నారు. అందుకే తాజాగా బాలయ్య కొడాలి నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మాటలు ఉండవు చేతల్లో జవాబు చెబుతామని బాలయ్య కొడాలి నానిని ఉద్దేశించి అనడం వెనక ఆయన్ని జగన్ మనిషిగా వైసీపీ నేతగా కలిపి కట్టేసిన సందేశం దాగి ఉందని అంటున్నారు.

ఇక కొడాలి నాని కూడా ఈ మధ్య తరచూ చేస్తున్న కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. జగనే ఏపీకి సుదీర్ఘ కాలం సీఎం. మరో నేతకు అసలు చాన్స్ లేదు అని కొడాలి నాని జోస్యం చెబుతున్నారు. టీడీపీ పని అయిపోయిందని కూడా కొడాలి నాని గట్టిగానే అంటున్నారు. జూనియర్ వచ్చినా మరెవరు వచ్చినా కూడా టీడీపీని నిలబెట్టలేరు అని ఆ మధ్యన కొడాలి నాని నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మొత్తానికి చూస్తే నానికి నందమూరి వారికి మధ్య ఎనలేని దూరం పెరిగింది అంటున్నారు. నాని కమ్మల పార్టీగా ఉన్న టీడీపీని దారుణంగా అటాక్ చేయడం కూడా నందమూరి వారి ఆగ్రహానికి మరో ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. చూడాలి ఈ బంధం విచ్చిన్నం కావడం శాశ్వతమా లేక తాత్కాలికమా అన్నది.