సినిమాల్లో పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ ఎదురైంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు ఘోర పరాభవం మిగిలింది. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి.
2014 ఎన్నికల సమయంలోనే పార్టీ ఏర్పాటు చేసిన పవన్… 2019లో ఎన్నికల బరిలో నిలబడ్డారు. విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే…. ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. జనసేన అభ్యర్థుల విజయం సంగతి పక్కన పెడితే… కనీసం పార్టీ అధినేతకు కూడా విజయం దక్కకపోవడం గమనార్హం.
దాంతో ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్.. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవడంతో జనసేన పార్టీ భవిష్యత్తు పెద్ద క్వచ్చిన్ గా మారింది. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమై ఘోర పరాజయం పాలయ్యారు.
అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, మీడియాతో ఆయన వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణంగా అంటున్నారు. మరో ప్రక్క తెలుగు దేశం పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఒక అండర్‌స్టాండింగ్ ప్రకారం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పవన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు