పార్టీలో మొదటినుండి పనిచేస్తున్న సీనియర్లలో కొందరిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేయటం చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలబరిలో నుండి తప్పుకున్న వారిలో చాలామంది కీలక నేతలే కావటం గమనార్హం. ఇందులో ప్రత్యేకహోదా ఎంపి పదవులకు రాజీనామాలు చేసిన ఇద్దరు ఎంపిలు కూడా ఉన్నారు. ప్రకటించిన జాబితా చూసిన తర్వాత కానీ వారికి జగన్ టికెట్లివ్వని విషయం తెలీలేదు.
ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే, ఎంపిలు పోటీ చేయబోతున్న వారిలో నెల్లూరు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి మాజీ ఎంపి, ఒంగోలు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అలాగే టికెట్లు ఖాయమనుకున్న బొత్సా ఝాన్సీరాణి, వరదుకల్యాణి, కిల్లి కృపారాణి, దాసరి జై రమేష్ తదితరులున్నారు.
మేకపాటికి, వైవి, వరుదు కల్యాణి, ఝాన్సీ లాంటి సీనియర్లను పూర్తిగా పార్టీ పనులకే ఉపయోగించుకోవాలని అనుకున్నారట. ఆయా జిల్లాల్లో అభ్యర్ధులందరినీ సమన్వయం చేసుకునేందుకే వీరికి టికెట్లు ఇవ్వలేదట. ఇక కిల్లి, దాసరి లాంటి వాళ్ళకి పార్టీ అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారట. దాంతో వాళ్ళు కూడా జగన్ హామీని పూర్తిగా నమ్మారని సమాచారం.
అంటే కొత్తగా చేరిన నేతల వల్ల తమకు ఎక్కడ ముప్పు వస్తోందో అన్న అభద్రత పార్టో నేతల్లో మొదలైంది. అయితే, ఎటువంటి అభ్రత అవసరం లేదని ఇతర పార్టీల నుండి చేర్చుకోవటంలో ఉద్దేశ్యం వైసిపిని బలోపేతం చేయటానికే అన్న హామీని జగన్ చెప్పారట. అంతేకాకుండా పార్టీ కష్టాల్లో ఉన్నపుడు తనవెంటే ఉన్న వారిని ఎట్టి పరిస్దితుల్లోను వదులుకోననే సంకేతాలను కూడా జగన్ పంపారు. ప్రకటించిన జాబితాను చూసిన తర్వాత విధేయతకే జగన్ పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతోంది.