నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు గట్టిగా లేని చోట్ల మార్చటం మామూలుగా జరిగేదే. కానీ గట్టిగా పనిచేస్తున్న నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలను మార్చేయటం ఎంతవరకూ సబబు ? ఇఫుడిదే ప్రశ్న హిందుపురం వైసిపిలో వినిపిస్తోంది. అనంతపురం జిల్లా హిందుపురం నియోజకవర్గంలో వైసిపి ఇన్చార్జిగా పనిచేస్తున్న నవీన్ నిశ్చల్ ను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా మార్చేశారు. నవీన్ ప్లేసులో టిడిపిలో నుండి వైసిపిలోకి చేరిన మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీని నియమించారు. సరిగ్గా ఎన్నికలకు ముందుగా జరిగిన ఈ పరిణామంతో వైసిపి నేతలు ఆశ్చర్యపోయారు. పైగా పార్టీ అధికారంలోకి వస్తే నవీన్ కు మంచి స్ధానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్ గట్టి వ్యూహకర్తే అయితే నవీన్ ను మార్చరు. పార్టీ కార్యక్రమాలను గట్టిగానే జనాల్లోకి తీసుకెళుతున్నారు. పోయిన ఎన్నికల్లో ఓడిపోయినా ఎటూ పోకుండా వైసిపినే అంటిపెట్టుకున్నారు. ఆర్ధిక పరమైన ఆరోపణలు పార్టీలోని చాలామంది నేతలపై వినిపిస్తునే ఉన్నాయి. కాబట్టి టిక్కెట్టు విషయంలో ఆరోపణలు వినిపించటమన్నది ప్రామాణికంగా తీసుకునేందుకు లేదు. పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళుతున్నారా లేదా ? పార్టీ నాయకులు, శ్రేణులతో టచ్ లో ఉంటారా లేదా అన్నదే ముందు చూడాలి. ఈ రెండు విషయాల్లో నవీన్ పై పెద్దగా ఆరోపణలు లేవు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా నవీనే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.
అటువంటిది హఠాత్తుగా తెలుగుదేశంపార్టీ తరపున రెండుసార్లు గెలిచిన మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత అబ్దుల్ ఘనీ వైసిపిలో చేరారు. ఇక్కడ నుండి ఘనీ రెండుసార్లు గెలిచారంటే అది పార్టీ గొప్పతనమే కానీ ఘనీ క్రెడిట్ ఎంతమాత్రం కాదు. కాకపోతే నియోజకవర్గంలో ముస్లింలు కూడా ఉన్నారంతే. అయితే, ఘనీకి ఎక్కడా చెడ్డపేరు లేకపోవటమే ప్లస్ పాయింట. అటువంటి ఘనీని పక్కకు తప్పించిన చంద్రబాబాబు బావమరిది కమ్ వియ్యంకుడు బాలకృష్ణకు టిక్కెట్టిచ్చారు. గెలిచిన తర్వాత బాలకృష్ణ కానీ చంద్రబాబు కానీ ఘనీని పట్టించుకోలేదు. అందుకనే చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న చివరకు వైసిపిలో చేరారు.
అయితే, పార్టీలో చేరేముందే టిక్కెట్టు హామీ తీసుకునే చేరానని సమాచారం. మరి అది నిజమే అయితే ఇంతకాలం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నవీన్ పరిస్దితేంటనే ప్రశ్న మొదలైంది. నవీన్ గెలుపుకు ఘనీనీ సాయం చేయమని చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే పదవేదో ఘనీకే ఇవ్వచ్చు కదా అనే చర్చ కూడా మొదలైంది. ఇపుడు నవీన్ పరిస్దితేమింటి అనే దానికిపైన కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే, టిక్కుట్టు కోసం టిడిపిలోకి వెళ్ళలేరు. బిజెపిలో చేరినా ఉపయోగం లేదు. ఇక మిగిలింది చేరితే జనసేనలో చేరటం లేదంటే జగన్ పై నమ్మకముంచి ఘని విజయానికి కృషి చేయటం. మరి నవీన్ ఏం చేస్తారో చూడాల్సిందే.