విజయసాయి నియామకం రద్దు కారణం తెలుసా ?

పార్టీలోను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వంలోను జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 15 రోజుల క్రితమే విజయసాయిని ఢిల్లీలో  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తు జగన్ నియమించిన విషయం తెలిసిందే.  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించటమే కాకుండా ఆ పోస్టుకు క్యాబినెట్ ర్యాంకు కూడా ఇచ్చారు.

అలాంటిది తాజాగా విజయసాయి నియామకాన్ని రద్దు చేస్తు తాజాగా ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. ఎప్పుడైతే విజయసాయి నియామకం రద్దయ్యిందో పార్టీలో పెద్ద సంచలనం మొదలైంది. విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందంటే మామూలు విషయం కాదన్నట్లుగా పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడే ఓ కీలకమైన అంశముంది.  ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ ఎంపి మరో లాభదాయక పదవిలో ఉండకూడదు. ఇప్పటికే విజయసాయి రాజ్యసభ సభ్యుడు. కాబట్టి క్యాబినెట్ ర్యాంకు పోస్టులో ఉండటం నిబంధనలకు విరుద్ధం. అందుకనే విజయసాయి నియామకాన్ని జగన్ రద్దు చేయాలని నిర్ణయించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఓ ఎంపి మరో లాభదాయక పదవిలో ఉండకూదన్న విషయం ముందుగా జగన్ ప్రభుత్వానికి  తెలీదా ? జగన్ కు తెలీకపోయినా చీఫ్ సెక్రటరీ చెప్పాలి కదా ? ముందు నియమించేసి తర్వాత నిబంధనలు అడ్డువస్తున్నాయని రద్దు చేయటమేమిటో అర్ధం కావటం లేదు.