ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయింది. ఈ సమయంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసారు.. ప్రతి ఫలాలు అన్ని ప్రజలందరికీ సక్రమంగా అందాయా? లేదా? వాటిలో లోపాలేమైనా ఉన్నాయా? వీటిపై మంత్రి వర్గం పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలపై ఆయా మంత్రులతో వర్చువల్ గా మాట్లాడటం జరిగింది. సంబంధిత అధికారులతో జగన్ అదే తరహాలో భేటీ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు అవినీతికి పాల్పిడనట్లు ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏడాది కాలంగా జగన్ ఏర్పాటు చేసిన ఇంటిలిజెన్స్ నిఘా నుంచి సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లిందిట.
అయితే నిజంగా వాళ్లు అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. కేవలం ఇంటిలిజెన్స్ అనుమానం మాత్రమే వ్యక్తం చేసిందిట. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మంత్రులపై స్పెషల్ టీంని ప్రత్యేకంగా మరో నిఘా వర్గంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంటే ఇకపై! ఆ ముగ్గురిపై ఇంటిలిజెన్స్ తో పాటు, స్పెషల్ టీమ్ కూడా కన్నేయనుందని తెలుస్తోంది. ఈ రెండు టీమ్ లు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తుదిగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంటే వేటు వేయడమా? కొనసాగించడమా? అన్నది తేలాలంటే మరో ఏడాది వెయిట్ చేయాలి.
జగన్ మంత్రి వర్గం ఏర్పాటు చేసినప్పుడే ఇక్కడ పదవులు ముఖ్యం కాదు…పాలన ముఖ్యమని. కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని..ఆ తర్వాత కొత్త టీమ్ ని తీసుకొస్తానని ఆనాడే చెప్పారు. కాబట్టి ఈ లోపు ఆ ముగ్గురు మంత్రులు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కనీసం మర్యాద అయిన దక్కుతుంది. కాదు కూడదు..బరి తెగించాము.. మరో ఏడాది తర్వాత ఊడిపోయే పదవి. అప్పుడు అందరితో పాటు ఎలాగూ బయటకు పోతామని యధేశ్చగా వ్యవహరిస్తే ఆ మర్యాద కూడా దక్చే ఛాన్స్ లేదు. కాబట్టి బంతి ఇంకా ఆ ముగ్గురి మంత్రుల కోర్టులోనే ఉంది.