గీతోపదేశం చేయటానికి పవన్ ని పిలిపించిన బీజేపీ అధిష్టానం !

why bjp big leaders want to meet pawankalyan ?

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి 2019 ఎన్నికలలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాను పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ , పార్టీ మొత్తానికి ఒక సీటు ను మాత్రం గెలుచుకున్నాడు .మరల ఎన్నికల వరకు పార్టీని కాపాడుకోవటానికి , నడిపించటానికి డబ్బు కావాలని మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటిషన్ అనే పేరును మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పవన్ జత కట్టి ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీకి ప్రత్నామ్యాయ పార్టీగా మారారు .

why bjp big leaders want to meet pawankalyan ?
amit shah and pawan kalyan

తెలంగాణలో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని హడావుడి చేసిన పవన్ రోజు వ్యవధిలోనే చేతులెత్తేశాడు. బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరిపి ఆ పార్టీకి మద్ధతు ప్రకటించాడు. బీజేపీ గెలుపుకోసం కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏకపక్షంగా బీజేపీకి మద్ధతు ప్రకటించిన తీరు పలువురు జనసైనికులను నిరాశకు గురిచేసింది.ఇక తదుపరి వంతు తిరుపతి ఉప ఎన్నికలదవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీకి అండగా ఉంటామని తేల్చేసిన పవన్ నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే రీతిలో మద్ధతుని బీజేపీ ఆశిస్తోందట , అందుకనే దానికి అనుగుణంగానే సుదీర్ఘకాలం తర్వాత ఢిల్లీ నుండి పవన్ కి అమిత్ షా వంటి వారి నుండి కాల్ వచ్చిందని అందుకనే యమా స్పీడ్ లో ఢిల్లీ కి ఎగిరిపోయాడట . బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి అన్ని లెక్కలు తేల్చేసుకుని వస్తారని అనుకుంటున్నారు.