ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంప్రదాయం మొదలైంది. అదేంటంటే దళితలపై అనవసరపు ఆరోపణలు మోపుతూ వారికి శిరోముండనం చేస్తున్నారు. ఈ దరిద్రపు సాంప్రదాయం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఘటనలపై ప్రభుత్వం చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఒకసారి జగిరితే ఆ యువకుడు ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశాడు. ఒక యువకుడు స్థానిక ప్రభుత్వం యొక్క సహాయాన్ని కొరకుండా రాష్ట్రపతికి లేఖ రాశాడంటే స్థానిక ప్రభుత్వం ఈమేరకు పని చేస్తుందో అర్ధమవుతుంది.
అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మరో ఘటన వెలుగు చూసింది. ఈసారి ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విశాఖలో శ్రీకాంత్ అనే యువకుడికి బిగ్ బాస్ లో పాల్గొన్న నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం చేశారు. ఈ శిరోముండనం కేసులో నూతన్ నాయుడి భార్య.. ఇతర పని వాళ్లు నిందితులయ్యారు. నూతన్ నాయుడిపై మాత్రం.. కేసు నమోదు కాలేదు. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య రగడ జరుగుతోంది. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే.. ఆయనను అరెస్ట్ చేయలేదా..? అని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. మరో వైపు… ఈ ఘటన వెలుగు చూసిన రోజున నూతన్ నాయుడు మాట్లాడుతూ… శ్రీకాంత్ సెల్ ఫోన్ దొంగతన చేశాడని.. దానికి ప్రాయశ్చితంగానే… బార్బర్‌ని ఇంటికి పిలిపించుకుని స్వయంగా గుండు గీకించుకున్నారన్న ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న ఎవరికైనా నూతన్ నాయుడు కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని అర్ధమవుతుంది.
అయితే శిరోముండనం చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు ఒక వీడియో కాల్ చేశారు. ఆ వీడియో కాల్ ఎవరికి చేశారన్న విషయం ఇంకా తెలియదు. కానీ అధికారులు తెలుసుకోవాలంటే చాలా సులువైన పని కానీ అధికారులు తెలుసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకవేళ ఆ వీడియో కాల్ చేసింది నూతన్ కే అని రుజువైతే నూతన్ నాయుడు పై కూడా కేసు నమోదు చేసే అవకాశముందని పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం నూతన్ నాయుడు ను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఘోరమైన ఘటనలు పడే పడే జరుగుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడంపై దళితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.