టీడీపీని ఇకపై భుజాన మోసేదెవరు.?

2024 ఎన్నికల సమయంలో పరిస్థితులెలా వుంటాయి.? అన్నది వేరే చర్చ. అప్పటిదాకా, తెలుగుదేశం పార్టీని భుజాన మోసేదెవరు.? గత కొన్ని రోజులుగా.. అంటే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయ్యాక.. టీడీపీ ఒంటరి అయిపోయింది.!

పార్టీని గాలికొదిలేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఢిల్లీలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నారు. మరోపక్క, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినిమా వ్యవహారాల్లో బిజీగా వున్నారాయె.!

నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మాత్రం, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వున్నంతలో ఈ ఇద్దరూ కాస్త బెటర్. కానీ, వీరికి మాస్ ఇమేజ్ లేదు. రాజకీయాల్లో కావాల్సింది మాస్ ఇమేజ్. చిత్ర విచిత్రమైన నిరసనలు చేపడుతున్నారు బ్రాహ్మణి, భువనేశ్వరి.

ఎవరు ఇస్తున్నారోగానీ, నిరసనల ఐడియాలు టీడీపీకి వర్కువట్ కావడంలేదు. హైద్రాబాద్ మెట్రోలో చేసిన పబ్లిసిటీ స్టంట్, టీడీపీకి మరింత చెడ్డపేరు తెచ్చింది. ‘ఇదేం పద్ధతి.?’ అని హైద్రాబాద్ మెట్రో ప్రయాణీకులు, టీడీపీ తీరుని తీవ్రంగా తప్పుపట్టడం చూశాం. సంకెళ్ళేసుకుని బ్రాహ్మణి, భువనేశ్వరి చేసిన పబ్లిసిటీ స్టంట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

వున్నపళంగా ఇప్పుడు టీడీపీకి మాస్ లీడర్ కావాలి. లేకనేం, టీడీపీకి చాలా సోర్సెస్ వున్నాయి. కాకపోతే, దేన్నీ సరిగ్గా వాడుకోలేకపోతోంది పార్టీ నాయకత్వం. ఏక వ్యక్తి నాయకత్వం అంటే ఇలాగే వుంటుంది మరి.! ఎవర్నీ టీడీపీలో చంద్రబాబు ఎదగనివ్వలేదు. అదే అన్ని అనర్ధాలకీ కారణం.

టీడీపీ మీద క్యాడర్ విశ్వాసాన్ని కోల్పోతోంది. నాయకులూ, పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రైట్ టైమ్‌లో రాజకీయంగా సరైన దెబ్బే వైఎస్ జగన్, టీడీపీని కొట్టారని అనుకోవచ్చేమో.!