ముహూర్తాలు ఫిక్స్… జగన్ అను నేను వర్సెస్ చంద్రబాబు అను నేను!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4 న వీటికి సంబంధించిన ఫలితలు రాబోతున్నాయి. ఈలోపు పలు రకాల సర్వేల ఫలితాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే… అవన్నీ బెట్టింగ్ బ్యాచ్ ఆడుతున్న మైండ్ గేం లో భాగాలే తప్ప వాస్తవాలు కాదని.. జూన్ 1 వరకూ ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల కావని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే… పోలింగ్ పూర్తయిన మూడు నాలుగు రోజుల తర్వాత వైఎస్ జగన్.. ఐప్యాక్ టీం ని కలిసిన సందర్భంగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశరు. ఇందులో భాగంగా… 2019 కంటే ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామని బలంగా చెప్పారు. ఐప్యాక్ తో ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ప్రశాంత్ కిశోర్ ఊహించని స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని నొక్కి చెప్పారు.

దీంతో… వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పత్రికల్లో బ్యానర్ లో రావాలనో, బ్రేకింగ్ న్యూస్ కోసమో జగన్ కబుర్లు చెప్పరు.. చెప్పారంటే కచ్చితంగా అందులో వాస్తవం ఉంటుంది.. అనే మాటలు ఆ పార్టీ శ్రేణుల్లోనో కాకుండా, విశ్లేషకులు, పరిశీలకుల నుంచి వినిపించింది. దీంతో… వైసీపీ నేతలు కూడా మరింత్ ధీమాగా ఉన్నారని అంటున్నారు.

ఈ సమయంలో తాను మళ్లీ గెలిచిన అనంతరం ప్రమాణస్వీకారం చేసేది విశాఖ నుంచే అని జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదే సమయంలో… జూన్ 9న వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో మరింత ధీమా పెరిగిపోయింది.. జగన్ మళ్లీ రాబోతున్నారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… వైఎస్ జగన్ పెట్టిన పథకాలను, వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను, ఆయన పెట్టిన కార్యక్రమాలనే కాపీ కొట్టి చంద్రబాబు ప్రకటించారనే విమర్శ ఏపీ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ “అమ్మ ఒడి” అంటే… చంద్రబాబు “తల్లికి వందనం” అంటున్నారనే సెటైర్లు బలంగ అవినిపించాయి. జగన్ పథకాలకు పేర్లు మార్చి ప్రకటించడం తప్ప కమిట్ మెంట్ తో కూడిన హామీలు ఇవ్వలేదని అంటున్నారు.

ఆ కాపీల పరిస్థితి అక్కడితో అయిపోలేదని.. ఆఖరికి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం తేదీ విషయంలోనూ టీడీపీ నేతలు అదే అనుసరిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి రావడం కన్ ఫాం అంటూ గంటా శ్రీనివాస రావు ప్రకటించారు. అక్కడితో ఆగని ఆయన జూన్9 న చంద్రబాబు సీఎంగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు.

దీంతో… నెటిజన్లు గంటాను ఓ ఆటాడుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా కనీసం సీఎంగా ప్రమాణస్వీకారం తేదీ అయినా సొంతంగా ఆలోచించమని చెబుతుండటం గమనార్హం. ఇంకా చాలా తేదీలు ఉన్నాయని.. అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచిస్తున్నారు! మరోపక్క… ఇప్పటికే చంద్రబాబుకు గంటాకు మద్య చాలా గ్యాప్ ఉందని.. అందుకే తప్పని పరిస్థితుల్లో గంటాకు ఆఖర్లో టిక్కెట్ దక్కిందని చెబుతున్నారు.

ఈసమయంలో కూటమి అధికారంలోకి వస్తే తాను కూడా కేబినెట్ బెర్త్ ల పోటీలో ఉన్నానని చంద్రబాబుకు గుర్తు చేయడం కోసమే గంటా ఇలా అందరికంటే ముందుగా ముహూర్తం కామెంట్లు చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా… జూన్ 4 వరకూ వేచి చూస్తేనే… “జగన్ అను నేను” అని విశాఖలో మారుమ్రోగిపోతుందా.. లేక, “చంద్రబాబు అను నేను” అని అమరావతిలో వినిపిస్తుందా అనేది తెలుస్తుంది. అప్పటి వరకూ ఎవరు ఏమి చెప్పినా వినడమే!!