రఘురామ నియోజకవర్గంలో మార్పు… ఈసారి దబిడి దిబిడే!

చంద్రబాబు ఢిల్లీ టూర్ కి రాక రాక వస్తే ఆయన సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు రాలేదు. అదే సమయంలో అంతా ఊహించినట్లుగానే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. మరో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలసి బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కొంతసేపు రఘురామ అనేక అంశాల మీద చర్చించారని అంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి రఘురామ కృష్ణంరాజుకి ఒక పార్టీ కావాలి. నిన్న మొన్నటివరకూ జనసేన, బీజేపీ అని కొన్ని కథనాలొచ్చినప్పటికీ… తాజాగా బాబుతోనే ఆయన ప్రయాణం కొనసాగించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా బాబుతో సుదీర్ఘ చర్చలు జరిగిన ట్రిపుల్ ఆర్ కి చంద్రబాబు ఈ మేరకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది.

అవును… రాబోయే ఎన్నికల్లో నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ నుంచి ఎంపీగా పోటీచేయబోతున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఆల్ మోస్ట్ అనధికారికంగా కన్ ఫాం అయిపోయిన నేపథ్యంలో… టీడీపీ అయితేనే కాస్త సేఫ్ అని భావిస్తున్న ఆయన… ఈ మేరకు మరోసారి నరసాపురంలో సైకిల్ గుర్తుపై పోటీచేసి గెలవాలని తపనపడుతున్నారని తెలుస్తుంది.

అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో నరసాపురం కంటే రాజమండ్రి సేఫ్ అని రఘురామ కృష్ణంరాజుకి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది. అయితే అందుకు కూడా ఆర్.ఆర్.ఆర్. సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే రాజమండ్రిలో రఘురామ కృష్ణంరాజుకు ఎంత వరకూ పట్టు ఉందనేది తెలియదు కానీ… ఇక్కడ టీడీపీ కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. ఇక సోము వీర్రాజు సొంత ఊరు కూడా కావడంతో బీజేపీ, ఇక జనసేనకు కూడా ఇక్కడ ఓట్లు బాగానే ఉన్నాయి. దీంతో… ఈసారి నరసాపురంతో పోలిస్తే రాజమండ్రే సేఫ్ అని ఆర్.ఆర్.ఆర్. కూడా నమ్ముతున్నారట.

పైగా గత కొన్ని రోజులుగా మార్గాని భరత్ కు రహురామకృష్ణరాజుకూ మీడియాలో వార్ నడుస్తూ ఉంది. దీంతో… ఈసారి వీరిద్దరి మధ్య పోటీ అంటే… అది మరింత రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే… ఆర్.ఆర్.ఆర్. ఎక్కడినుంచి పోటీ చేసినా… ఆయనపై వైసీపీ మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టే సూచనలు ఉన్నయనడంలో సందేహం లేదు!