AP: జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఏపీలో మాత్రం ఎన్నికలు అప్పుడే: చంద్రబాబు

AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానంలో ఈ ఎన్నికలకు ఇటీవల రామ్ నాథ్ కోవింద్ కమిటీ కూడా ఆమోదముద్ర తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల నాయకులు అన్ని పార్టీ అధినేతలు కూడా ఆమోదం తెలిపారు. అయితే ఈ ఎన్నికలపై శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానానికి తాము ఇప్పటికి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నామని వెల్లడించారు. జమిలీ పై అవగాహనలేని వైసీపీ నేతలు.. తమ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఈ విధంగా దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఆంధ్రాలో మాత్రం 2029 లోనే జరుగుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీచోటా దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు.

LIVE : జమిలీ ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | CM Chandrababu Key Comments on Jamili Elections