సిఎం వాట్సప్ ఖాాతా బ్లాక్..యాజమాన్యం షాక్

అవును తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు వాట్సప్ పెద్ద షాకే ఇచ్చింది. సిఎం రమేష్ వాట్సప్ ఖాతాను  వాట్సప్ యాజమాన్యం తొలగించింది. వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని గతంలోనే వాట్సప్ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వాట్సప్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. వాట్సప్  పోస్టింగుల్లో రెండు పనికివచ్చేవుంటే 20 పనికిమాలినవే ఉంటున్నాయ్. నిజానికి వాట్సప్ పోస్టింగుల్లో పనికిరాని చెత్తే ఎక్కువ. కానీ పనికొచ్చే ఒక్క పోస్టింగ్ కోసమని పనికిరానివాటన్నింటినీ భరిస్తున్నారు అందరూ.

ఇతర సోషల్ మీడియాలో లాగే ఈ మధ్య వాట్సప్ ఖాతాల్లో కూడా అశ్లీల, అసభ్యకరమైన మెసేజ్ లు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయ్యే మెసేజ్ లు కూడా లక్షల్లో ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పై జరిగిన దుష్ప్రచారమే ఇందుకు ఉదాహరణ. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రత్యర్ధులపై రాజకీయ పార్టీలు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నాయి. హాయిగా నవ్వుకోతగ్గ పోస్టింగులో లేకపోతే వాస్తవానికి దగ్గరగా ఉండే పోస్టింగులైలే ఓకే. కానీ నేతలను వారి కుటుంబసభ్యులను కూడా బాగా కించపరిచే విధంగా ఇంట్లో ఆడవాళ్ళను కూడా సోషల్ మీడియా బయటకు లాగి రోడ్డు మీద పడేస్తోంది.

సోషల్ మీడియా బెడద బాగా ఎక్కువైపోవటంతో మిగితా వాటి యాజమాన్యాలకు అందినట్లే వాట్సప్ యాజమాన్యాలకు కూడా ఫిర్యాదులందాయి. దాంతో వాట్సప్ ఖాతాల నుండి అసభ్య, అశ్లీల పోస్టింగులపై యాజమాన్యం నిఘా పెట్టింది. అటువంటి ఖాతాలను బ్లాక్ చేసేస్తున్నారు. అందులో భాగంగానే సిఎం రమేష్ ఖాతాను కూడా బ్లాక్ చేసినట్లు యాజమాన్యం సమాచారం అందించింది. ఇతర యూజర్ల నుండి వచ్చిన ఫిర్యాదు ఆదారంగానే ఖాతాను బ్లాక్  చేసినట్లు స్పష్టం చేసింది. మరి రమేష్ ఖాతా నుండి ఎలాంటి పోస్టింగులు బయటకు వెళుతున్నాయో మాత్రం తెలీలేదు.