AP: నాగబాబు కంటే బాలయ్యకు ఏం తక్కువ… చంద్రబాబు తీరుపై ఫైర్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్?

AP: ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు మెగా వర్సెస్ నందమూరి అనే విధంగా మారిపోయాయి. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేనతో అలాగే బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలా కూటమి పార్టీలు ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీని సాధించడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది .ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అభిమానులకు ఏమాత్రం మింగుటపడడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇలా తెలంగాణలో ఓటు వేసినా నాగబాబుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎన్నికలలో పోటీ చేయలేదు అలాంటి ఈయనకు మంత్రి పదవి ఇవ్వడమేంటని విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలాంటి తరుణంలోనే నందమూరి అభిమానులు కూడా చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. నాగబాబు కంటే బాలకృష్ణ గారికి ఏం తక్కువ ఎందుకని బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. నాగబాబు ఎక్కడ ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ మండిపడుతున్నారు కానీ బాలకృష్ణ మాత్రం మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారని గుర్తు చేస్తున్నారు.

2014లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు ఇక 2019 జగన్ సునామీలో కూడా ఈయన తట్టుకొని నిలబడి హిందూపురం నుంచి గెలుపు అందుకున్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా ఈయన భారీ మెజారిటీతో హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎంపికయ్యారు. ఇలా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను కాకుండా నాగబాబును మంత్రిని చేయడం ఏంటి అంటూ నందమూరి అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.