అంతర్వేది రధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీ నానా రభస చేసింది. జనసేన-బీజేపీల కూటమి పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మార్చాలని చూసారు. తద్వారా హిందువుల్లో జగన్ పై వ్యతిరేకత తీసుకురావాలన్నది ఆ రెండు పార్టీల ప్లాన్. ఈ కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని..నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాలని పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేసారు. బీజేపీ+ జనసేన కలిసి ఉద్యమిస్తే సంచలనమే అవుతుందని భావించారు. మరి ఆ రెండు పార్టీలు ..వామపక్షాలు ఇలా జరుగుతుందని అనుకున్నాయో! లేదో తెలియదు గానీ! జగన్ మోహన్ రెడ్డి నిజంగానే సీబీఐకి అప్పగించి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
నిజాన్ని నిగ్గు తేల్చేది సీబీఐ అధికారులేనని తేల్చేసారు. ఈ కేసుకు రాష్ర్ట అధికారులకు ఎలాంటి సంబంధం లేదని నేరుగా ఫైల్ తీసుకెళ్లి సీబీఐ అధికారుల చేతుల్లోనే పెట్టారు. ఆ రకంగా జగన్ అంతర్వేది ఘటన నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. దీంతో జనసేనకు పంచ్ పడినట్లు అయింది. పవన్ కళ్యాణ్ నోట సీబీఐ మాట ఇలా వచ్చిందో లేదో! అలా సాయంత్రానికి కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఇంతకు ముందు కర్నులు కు చెందిన సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా ఇలాగే జరిగింది. సుగాలి ప్రీతి విషయంలో పవన్ ఉద్యమానికి సిద్దమవుతోన్న సమయంలో జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించి పవన్ కి షాక్ ఇచ్చారు.
ఇప్పుడు అంతర్వేది ఘటనపై అదే జరిగింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ జగన్ కన్నా ముందుగా అలెర్ట్ అయ్యారంతే తేడా. కేసులు సీబీఐ చేతికి వెళ్తే ఎలా ఉంటుందో తెలిసిందే. ఇటీవలి కాలంలో సీబీఐకి అప్పగించిన కేసుల్లో ఎలాంటి పురోగతి ఉండటం లేదన్నది తెలిసిందే. ఈ సంగతి పవన్ కళ్యాణ్ ముందే ఊహించి ట్విటర్ ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కేసు సీబీఐకి వెళ్లిదంటే పరిష్కారం అయినట్లు కాదు. నిదింతుల్ని పట్టుకోవడానికి తొలి అడుగు మొత్రమే. ఈ కేసుతో పాటు రాష్ర్టంలో హిందు దేవాలయాలన్నింటిపై జరిగిన దాడులన్నింటిపై విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసారు.