ఏంటి ప్రశాంత్ కిశోర్ జగన్ భేటీ వెనక అంత స్టోరీ ఉందా ?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ‌మోహన్ ‌రెడ్డి పార్టీ గెలుపు కోసం గత ఎన్నికల్లో పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా సీఎంతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇద్దరి మధ్య దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు, రాజకీయ పరిణామాలపై వీరు నిశితంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే , అసలు ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ జగన్ తో భేటీ కావడం తో దీనిపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ హాట్ హాట్ గా సాగుతుంది.

Prashant Kishore meets YS Jagan

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు విషయం లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. వాటన్నిటినీ పక్కనబెట్టి ఈ విధంగా జగన్ తో భేటీ అవ్వటం వెనకాల పెద్ద కీలకమైన విషయమే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి గత వారమే వీరు భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వద్ద వాయిదా పడింది. సామాజిక మాధ్యమాల్లో ‘నవరత్నాలు’పై జరుగుతున్న ప్రచారం, రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న దాడులు, తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన విషయాలను ఇరువురు చర్చించినట్టు సమాచారం.

అసలు విషయం ఏమిటంటే … రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయంలో ప్రజలలో కొద్దిగా భావోద్వేగం రేగి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లు కింద నుండి గ్రౌండ్ రిపోర్ట్ అందినట్లు ఈ విషయాన్ని జగన్ కి చెప్పడానికి పీకే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రామతీర్థం ఘటనలో విగ్రహం ధ్వంసం అయిన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవటం అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రులు కూడా పెద్దగ రియాక్ట్ కాకపోవడంతో ప్రజలలో ప్రభుత్వంపై కొద్దిగా ఆగ్రహం ఉన్నట్లు ఈ విషయాన్ని చెప్పి జగన్ ని అలెర్ట్ చేయడానికి పీకే వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా తన శిష్యుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో టీడీపీ కి వ్యూహకర్తగా ఉన్న తరుణంలో ఆ ఎన్నికలలో ఏ విధంగా వైసీపీ ముందుకు వెళ్లాలో అన్నదానిపై కూడా జగన్ తో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రశాంత్ కిషోర్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు అంటే ఎదో పెద్ద అంశం గురించే చర్చ జరిగి ఉంటుంది అని చర్చించుకుంటున్నారు.