రాజధాని తరలింపు వార్తల నేపథ్యంలో అక్కడి రైతుల ఆందోళనను నేరుగా పర్యవేక్షిస్తున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఎవరికీ అర్థం కావడంలేదు. తన కలల సౌధం కళ్లముందే తరలివెళుతుంటే అయన పడుతున్న ఆందోళన అంతాఇంతా కాదు. రాజధాని తరలింపు కోసం అనేక చేస్తున్న ఆందోళన కొత్త పుంతలు తొక్కుదోంది. నిరసనలను దేశ వ్యాప్తం చేయడంలో ఆయన సక్సెస్ ఆయ్యారు. అయితే ఎత్తుగడలు రాజధానిని ఆపడానికి ఉపయాగపడతాయా అని రైతులు ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం జగన్ దీనిని ప్రిస్టేజీగా తీసుకొని అడుగురు వేస్తున్నారు. లీగల్‌గా ఇబ్బందులు తలెత్తకుండా పలుకమిటీల ద్వారా ఆయన చేయదల్చుకున్నది చెప్పిస్తున్నాడు. రాజధాని విషయం తేల్చే అంశం చివరికి వచ్చింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈనెల 20న నిర్వహిస్తున్నారు. వీటికోసం సీఎం జగన్ అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీలోనే తేల్చుకుందాం ..రా అంటూ సవాల్ విసురుతున్నాడు. అయితే రాజధాని ప్రాంత రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ ఆందోళనను ఒంటి చేత్తో మోస్తున్న చంద్రబాబు వారి ఆశలను ఏమాత్రం నెరవేరుస్తారోనన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే తరలింపునకే ప్రభుత్వం సిద్ధమైందని అసెంబ్లీ ద్వారా కేవలం అంగీకారం మాత్రమే తీసుకోన్నదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తన వాణిని వినిపించాలా.. లేదా బయటే నిరసన వ్యక్తం చేశాలా.. రాజధానికి రైతులు, కమ్యూనిస్టలు, ఇతర కలిసి వచ్చే వారితో కలిసి అసెంబ్లీకి వెళ్లే రోడ్లను దిగ్బంధించాలా .. ఇంకా ఏదైన తీవ్రమైన ఆందోళనకు శ్రీకారం చాట్టాలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. లేదా రాష్ర్ట విభజన సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రేతో లగడపాటి కలకలం రేపిన విషయం తెలిసిందే. అలాంటి నిరసన విషయం కూడా పలువురు ప్రస్తావించినట్లు తెలిసింది. ఇది టీడీపీకి, చంద్రబాబునాయుడికి జీవన్మరణ సమస్యగా మారింది. అయితే 40 ఇయర్స్ ఇండస్ర్టీ చంద్రబాబును అంత తక్కువిగా అంచనా వేయవద్దని అన్నిటికి సిద్ధంగా ఉండాలని వారి ఎత్తులను చిత్తు చేయాలని వైసీపీ వ్యూహంతో ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఏమేరకు తమకు అవకాశం ఇస్తారనే విషయంలో కూడా టీడీపీ అనుమానంగా ఉంది.