పవన్ కు ఏమో అయ్యింది

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. జనేసేనకు క్యాడర్ ఉందికానీ లీడర్ షిప్పే లేదన్నారు. స్వయంగా పార్టీ అధినేతే ఆ విధంగా వ్యాఖ్యానించటంతో నేతలందరూ అయోమయానికి గురయ్యారు.

ఎందుకంటే జనసేనలో లీడర్ షిప్ లేదంటే అందుకు బాధ్యుడు పవన్ తప్ప మరొకరు కాదు. బహిరంగ సభల్లో పవన్ మాట్లాడుతూ లీడర్లను తయారు చేసుకునే సత్తా ఉందని ఎన్నోసార్లు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత ఘనంగా ప్రకటించుకున్న వ్యక్తి మరి ఎందుకు లీడర్లను తయారు చేసుకోలేకపోయారు ?

పైగా ఇతర పార్టీల్లో లీడర్లుంటే తనకు జనసైనికుల మద్దతుందని, జనాల అభిమానం ఉందని ప్రకటించుకున్న గొప్ప నేత పవన్. తీరా ఎన్నికల్లో తల బొప్పి కట్టిన తర్వాత జనాలు జనసేనను తిరస్కరించిన తర్వాత తీరిగ్గా ఇపుడు లీడర్ షిప్ కొరతుందని చెప్పటం దివాళాకొరు మాటలు కాక మరొకటి కాదు.

పవన్ ను జనాలు నమ్మలేదు. పైగా అప్పటి  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడుతో చేతులు కలపటాన్ని జనాలు వ్యతిరేకించారు. అందుకే జనేసేన 140 నియోజకవర్గాల్లో పోటి చేస్తే 20 చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కాయంటే జనాలు పవన్ ను ఏ స్ధాయిలో వ్యతిరేకించారో అర్ధమైపోతోంది. కాబట్టి పనికిమాలిన మాటలు చెప్పటం మానేసి రాజకీయాల్లో ఉండదలచుకుంటే నిజాయితిగా ప్రతిపక్షం చేయాల్సిన పని చేస్తే జనాలు వాళ్ళే దగ్గరవుతారు.