వీకెండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ వచ్చేశారహో.!

వారాంతాల్లో మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజకీయాలు చేస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటి పొలిటీషియన్లు కూడా వుంటారా.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. కానీ, ఎవరేమనుకున్నా ఆయన మాత్రం డోన్ట్ కేర్.! వీకెండ్ పొలిటీషియన్.. అన్న పేరుకి తానే బ్రాండ్ అంబాసిడర్.. అన్నట్లు వ్యవహరిస్తుంటారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరిది. ఆయన మళ్ళీ విజయవాడలో ల్యాండ్ అయ్యారు. హైద్రాబాద్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతోందంట.. అంటూ నిన్ననే సినిమా న్యూస్ బటయకు వచ్చింది. ఇంతలోనే ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.

హైద్రాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్, మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో మీటింగు ఏర్పాటు చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన గలాటా, ఈ నేపథ్యంలో అరెస్టయి.. విడుదలైన జనసేన నేతల్ని పవన్ కళ్యాణ్ కలిశారు.. వారిని ఘనంగా సన్మానించారు కూడా.! ఏం ఘనకార్యం చేశారనో మరి.!

పవన్ కళ్యాణ్, విజయవాడ వచ్చారు సరే.! మొన్నటిలా పవన్ కళ్యాణ్ ఇంకోసారి ‘చెప్పు’ చూపిస్తారా.? లేదంటే, వైసీపీ మీద మరో రకమైన మాటల దాడి చేస్తారా.? ఏం, ఎందుకు చెయ్యరు.. ఆయన వున్నదే ఆ పని చేయడానికి. వారంలో ఒకటి రెండు రోజులైనా వైసీపీ మీద విమర్శలు చేయకపోతే ఆయనకి కష్టమే.!

2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో జనసేన పార్టీ చేస్తుందో జనసేన కార్యకర్తలకు అవగాహన లేదు.. సరైన సమాచారం అసలే వుండదు. కానీ, పవన్ కళ్యాణ్ వస్తున్నారహో.. అన్న అనౌన్స్‌మెంట్‌తోనే పూనకంతో ఊగిపోతుంటారు. వాళ్ళే పవన్ కళ్యాణ్ బలం.. వాళ్ళే జనసేనకు అండ.!