Weather Report: ఉభయ తెలుగు రాష్ట్రాలని చలి బెంబోలెత్తిస్తోంది. ఉత్తర, ఈశాన్యం నుంచి వీస్తున్న చలిగాలులు రానున్న నాలుగు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.తెలంగాణ పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. కోస్తాఆంధ్రలోని విశాఖ ఏజెన్సీ లో చలి తీవ్రత బాగా పెరిగింది. లంబసింగిలో 4. డిగ్రీలు, చింతపల్లిలో 5.8, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే మరోవైపు రోడ్లపైన భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇలాంటి సమయాల్లో వాహనదారులు చాలా జాగ్రత్తగా రోడ్ల మీద వాహనాలను నడపాలి. పొగమంచు కప్పెయ్యడం వలన రోడ్లు కనిపించవు. దీని వలన వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.