Ap: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెర వేరుస్తారని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఇప్పటివరకు సూపర్ సిక్స్ హామీలను మాత్రం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని స్పష్టమవుతుంది కేవలం పెన్షన్ మాత్రమే ప్రతి ఒక్కరికి అందుతున్నప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా కొంతమందికి తిరిగి డబ్బు జమ కాలేదని తెలుస్తోంది. ఇక సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చే దిశలో కూటమి ప్రభుత్వం అడుగులు వేయలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు సైతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి కీలక విషయాలను వెల్లడించారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన తరువాతనే ఎన్నికలకు వెళ్తామని తెలియజేశారు.
మేము అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పై ఉందని తెలిపారు. కేంద్ర చొరవ చూపడంతోనే రాష్ట్రానికి కాస్త ఆక్సిజన్ అందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర సంపద కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోలేదు అంటూ ఈయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాటలను బట్టి చూస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయటానికి ఖాళీగా ఉందని చెప్పకనే చెప్పేశారు.
ఇలా రాష్ట్రం వెంటి లెటర్ పై ఉందని ఈయన మాట్లాడటంతో రాష్ట్ర వెంటిలేటర్ పై ఉందా లేదా అనే విషయం తెలియకుండానే ఇలాంటి అలివి కానీ హామీలను ఇచ్చారా అంటూ మరికొందరు మంత్రి తీరుపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు వైకాపా నాయకులు ఎప్పటికప్పుడు సూపర్ సిక్స్ పథకాల గురించి కూటమి నేతలను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.