పాలకులకు కావాలిసినది ఏమిటి? ఒక జనసైనికుడి అభిప్రాయం.

పాలకులకు కావాలిసినది ఏమిటి?

చిన్న పిల్లల మనస్సుల్లో కూడా కక్షలు, కార్పణ్యాలు, చిన్నా పెద్దా అనే విష బీజాలు వేయడం తగునా?

ఆఫ్టర్ ఆల్ ఒక టెన్త్ పాస్ అయినోడు మా జగనన్నని తిట్టడం ఏమిటన్నా అంటూ ఒక చిన్నారితో అధికార పార్టీ సభ్యులు మాట్లాడించిన మాటలు ఆశ్చర్యం కలిగించక మానదు.

చిన్నారి నోటినుండి వచ్చిన పై మాటలు వింటుంటే, పాలకులు విలువలు మరచి, వారు తలచుకొంటే అభం శుభం తెలియని చిన్నారుల మనస్సులో కూడా కక్ష, కార్పణ్యాలు అనే విష బీజాలు వేయ గలరు అని తెలిసిస్తున్నది.

పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ ఇంటర్ (MEC ) అనుకొంటా. మరి జగన్ మోహన్ రెడ్డి క్వాలిఫికేషన్ బి.కామ్ అని తెలుస్తున్నది. అయితే నాటి ఇంటర్ సిలబస్’కి డిగ్రీ సిలబస్’కి తేడాలేదు, కొద్దిగా డెప్త్ ఎక్కువ అంతే. సబ్జక్ట్స్, చాఫ్టర్లు అన్నీ సమానమే. అటువంటి ఇంటర్ చదివిన పవన్, బీకామ్ చదివిన జగన్’కి చెప్పడానికి అర్హత లేదు అంటున్నారు.

ఇంటర్ చదివిన పవన్, బీకామ్ చదివిన జగన్’ని విమర్చించడానికి సరిపోనప్పుడు, బీకామ్ చదివిన జగన్, MA చదివిన బాబుని ఎలా విమర్చించేవాడు. బాబుకే సీఎం ఇచ్చేయవచ్చుగా. వైసీపీకి ఒక లాజిక్ మిగిలిన వాళ్ళకే మరొక లాజిక్ అనడం ఎంతవరకు మంచిదో నాకు అర్ధం కావడం లేదు.

మరి బీకామ్ చదివిన జగన్’కి , తన కంటే ఎక్కువ చదివిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారాలకు చెప్పే అర్హత ఉందా?. బీకామ్ చదివిన జగన్, తన కంటే ర్యాంకులో చిన్నోడు అయిన అధికారితో తన పై అధికారి అయిన L V సుబ్రమణ్యంపై ఎలా అథారిటీ చెలాయించడానికి ప్రయతించారు. వైసీపీ చూపించిన మాటల ప్రకారం ఇంటర్ వ్యక్తి బీకామ్’కి చెప్పడానికి సరిపోదు అన్నప్పుడు, బీకామ్ వాడు సీనియర్ ఐఏఎస్ ఎలా చెబుతాడు.

అటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎక్కువ చదివితే వాడే సీఎంగా ఉండాలిగాని బీకామ్ చదివిన వ్యక్తి సీఎం ఎలా అవుదాడు అనే లాజిక్ ఎలా మిస్ అయ్యారో మన వైసీపీ నాయకులకే తెలియాలి.

అయినా కరుణానిధి సుదీర్ఘకాలం తమిళనాడు సీఎంగా అద్భుతంగా చేసాడు. అతడు చదివింది కేవలం 10th discontinued . జయలలిత చదివింది కేవలం ఇంటర్ discontinued . కానీ ఆమె పాలనకు తమిళలు ఇప్పటికీ చేతులెత్తి నమస్కరిస్తారు.

అంత ఎందుకు మన ప్రధాని విధార్హత కేవలం డిగ్రీ. కానీ హైలీ క్వాలిఫైడ్ అయిన మన్ మోహన్ సింగ్ కంటే అద్భుతమైన పాలననిస్తున్నారు అని అందరూ కొనియాడుతున్నారు. గొప్ప గొప్ప దీర్ఘకాలిస సమస్యలను కూడా తీర్చేస్తున్నారు. మాన్ మోహన్ సింగ్ కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలు మోడీపై రావడం లేదు.

విద్య కంటే వివేకం, అంకిత భావం, నిబద్దత అనేవి ముఖ్యం అని భారత రాంజ్యాంగ నిర్మాణ కర్తలకు తెలుసు. కానీ ఈ విషయం మన వైసీపీ నాయకులకు తెలియకపోవడం దురదృష్టం కావచ్చు.

చివరగా ఇంటర్ చదినవాడు, బీకామ్ చదివినవాడికి చెప్పడానికి సరిపోడు అనుకొంటే, బీకామ్ చదివినవాడు, ఐఏఎస్, ఐపీఎస్ లకు చెప్పడానికి అనర్హుడు అవుతాడా అనేది వైసీపీవాళ్ళు తక్షణమే చెప్పాలి.

ఏకవేళ ప్రజాభీష్టం ఉన్నదీ అని అంటే, పవన్ కళ్యాణ్’కి కూడా ప్రజాభీష్టం ఉన్నది. అయినా ముఖ్యమంత్రి అయినా లేదా మారే మంత్రి అయినా ప్రజలకు సేవకులు. ప్రజలే పాలకులు. ఆ ప్రజలకు అడిగే హాక్కులేదనడం మూర్ఖత్వం అనిపించుకొంటుంది అనుకొంటా.

ఆలోచించండి…. మీ ప్రత్యర్థులపై దాడిచేయడానికి చిన్న పిల్లల మనస్సుల్లో కూడా విషబీజాలు నాటాలా?