ఉండవల్లి భయపడినంతా అయింది?

“తమ సంస్థలో జరుగుతున్న అవకతవకలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు మార్గదర్శి యాజమాన్యం అన్నీ ఆధారాలను ధ్వంసం చేస్తున్నట్లు సీఐడీ గుర్తించిందట! తాము ష్యూరిటీ సంతకాలన్నీ చేయించినా కూడా.. తమకు చిట్టీ మొత్తం చెల్లించడం లేదని కొంతమంది డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట.” ప్రస్తుతం ఈ విషయం… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శిలో చిట్ వేసుకున్నవారిని, వారి కుటుంబాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది.

ఇదే క్రమంలో… మనీ ఫ్లో లేక చిట్టీలను పాడుకున్న వాళ్ళకి డబ్బులు చెల్లించటానికి యాజమాన్యం నానా అవస్తలు పడుతుందట. మండుటెండల్లో మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా… రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్న డిపాజిట్ దారులు ఈ విషయాన్ని బలపరుస్తున్నారంట.

అవును… మొదటినుంచీ మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయాని చెబుతూ వస్తున్నారు. డిపాజిట్లు సేకరించడం తప్పన్న సంగతి ఒకెత్తు అయితే… సేకరించిన డిపాజిట్లను షేర్ మార్కెట్ లోనో, ఇతర సంస్థల్లోనో పెట్టుబడుల పేరున దారి మళ్లించడం వల్ల ఇబ్బందులు తప్పవని.. రేపు బోర్డు తిప్పేస్తే సుమారు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డిపాజిట్ దార్ల కుటుంబాలు రోడ్డున పడిపోతాయని చెబుతున్నారు! అయితే ప్రస్తుతం ఇదే సమస్య ఉందని చెబుతున్నారట సీఐడీ అధికారులు.

గతేడాది డిసెంబర్‌ నుంచి కొత్త చిట్టీలు ప్రారంభం కాకపోవడంతో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ లో మనీ సర్క్యులేషన్‌ నిలిచిపోయిందని చెబుతున్నారు సీఐడీ అధికారులు. పాత చిట్టీల చందాదారులు చెల్లించిన మొత్తాన్ని రామోజీరావు… తమ సొంత సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేశారని.. రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్లను మ్యూచ్‌ వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్‌ లో పెట్టుబడిగా పెట్టారని చెబుతున్నారు. అయితే… ఇప్పుడు కొత్త చిట్టీలు లేనందున, ఇప్పటికే ఉన్న సొమ్ము దారిమళ్లించడంవల్ల… మార్గదర్శి లావాదేవీలు నిలిచిపోయాయని, ఫలితంగా.. పాత చిట్టీలు పాడిన చందాదారులకు కూడా సకాలంలో డబ్బు చెల్లించడం లేదని అంటున్నారు!

సాధారణంగా అయితే… కొత్త చిట్టీలు ప్రారంభమైతే.. ఆ చందాదారులు చెల్లించే మొత్తాన్ని, పాత చిట్టీలు పాడిన వారికి చెల్లిస్తుంటారు. ఇదే క్రమంలో… ప్రతి చిట్టీలోనూ యాజమాన్యం వాటా కింద అట్టిపెట్టుకున్న టికెట్ల చందా మొత్తాన్ని కూడా అవే నిధుల్లో చెల్లిస్తుంటారు. అయితే… తాజాగా వాటికి సంబంధించిన వివరాలు కూడా మాయ చేసేశారట! దీంతో… తాము ష్యూరిటీ సంతకాలన్నీ చేయించినా కూడా.. తమకు చిట్టీ మొత్తం చెల్లించకపోవడంతో చందాదారులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.

దీంతో… మార్గదర్శి అక్రమాలు బయటపడటంతో ఆ డిపాజిట్‌ దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. తమ డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని.. వడ్డీ లేకపోయినా పర్లేదు.. కనీసం అసలైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. అయినా కూడా… బ్రాంచి కార్యాలయాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోందని.. ఫలితంగా వారిలో కొందరు సీఐడీ అధికారులను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది.

ఏది ఏమైనా… ఇంతకాలం గొంతుపోయేలా మార్గదర్శి లో జరుగుతున్న అక్రమాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమి చెప్పారో… ఇప్పుడు అదే సమస్య తెరపైకి వచ్చిందని.. నిబంధనలు పాటిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని.. ప్రతి చిట్‌ కూ ఓ బ్యాంకు ఖాతా ఉంటే జాప్యానికి ఆస్కారమే ఉండేది కాదని.. నిధుల మళ్లింపు జరగకపోయి ఉంటే చిట్‌ దారులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవి కావని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు!