ఈవీఎంలలో మోసం!… జగన్ వాదనకు “వీ.ఎఫ్.డీ” ఇచ్చిన సాక్ష్యాలు ఇవే!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ఫలితాలపై అటు జగన్ తో పాటు ఇటు ఒకవర్గం సామాన్య ప్రజానికంలోనూ సందేహాలు ఉన్నాయని అంటున్నారు. అనూహ్యంగా… జగన్ ప్రత్యర్థులు సైతం వారికి వచ్చిన భారీ మెజారిటీలను చూసి షాక్ తిన్నట్లు చెబుతున్నారనే చర్చా జరిగింది.

ఇక ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన జగన్… ఈ ఫలితాలపై షాక్ అవుతూ, ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తారు, సాక్ష్యాలు లేకుండా ఎవరిపైనా ఆరోపణలు చేయలేమని గద్గద స్వరంతో వెల్లడించారు. దీంతో… నాటి నుంచీ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఇక చంద్రబాబుని “ఈవీఎం సీఎం” అంటూ పలువురు నెటిజన్లు చేస్తున్న కామెంట్లూ హల్ చల్ చేస్తున్నాయి.

అలా అని జగన్ సీఎం అయిపోయి ఉండాలి అని కాకపోయినా.. 11 స్థానాలకు అయితే కచ్చితంగా పరిమితం అయ్యి ఉండకూడదని.. 40శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు పలువురు! ఇక పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీలో వైసీపీకి వచ్చిన ఫలితాలపై షాకింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు! ఈ నేపథ్యంలో జగన్ వాదనకు, వైసీపీ కార్యకర్తలు, పలువురు ప్రజానికం సందేహాలకు బలం చేకూర్చుతూ ఓ నివేదిక హల్ చల్ చేస్తుంది!

అవును… ఓట్ ఫర్ డెమోక్రసీ (వీ.ఎఫ్.డీ) అనే సంస్థ తాజాగా ఓ నివేదిక విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా… భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో అత్యంత దారుణాలు జరిగయని.. దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు, కౌంటింగ్ రోజు ఈవీఎంలలో కనిపించిన ఓట్లకూ ఏమాత్రం పొంతన లేదని.. సుమారు 4 కోట్ల పైచిలుకు ఓట్లు అదనంగా కౌంటింగ్ సమయానికి ఈవీఎంలలో దర్శనమిచ్చాయని పేర్కొందని అంటున్నారు.

ఫలితంగా… ఈవీఎంలలో జరిగిన అవకతవకల వల్ల బీజేపీకి దేశవ్యాప్తంగా 79 స్థానాల్లో లబ్ధి చేకూరిందని.. ఈ మేరకు… లోక్ సభ ఎన్నికల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆ సంస్థ ఆరోపించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో… ఏపీ పరిస్థితిపై కూడా ఈ సంస్థ అవకతవకలైన ఓట్ల వివరాలు వెల్లడించిందని అంటున్నారు.

ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాల్లోనూ కలిపి సుమారు 49 లక్షల ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయనేది ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో కీలక అంశం అని చెబుతున్నారు. అంటే… ఈవీఎంలలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఉన్న ఓట్ల కంటే 49 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంటింగ్ సమయానికి దర్శనమిచ్చాయన్నమాట. దీన్నే దొంగ ఓట్లు అని, రిగ్గింగ్ చేయడం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అని అంటారని అంటున్నారు.

అయితే… ఈ మోసం ఏపీకే పరిమితం కాలేదని.. ఏపీలోని 49 లక్షల ఓట్లతో పాటు అత్యధికంగా మహారాష్ట్రలో 82.63, ఒడిశాలో 42.01, పశ్చిమ బెంగాల్ 36.71, రాజస్థాన్ 29.3, కర్ణాటక 22.33, మద్యప్రదేశ్ 21, కేరళ 17.12, గుజరాత్ 16.17, అస్సాం 15, తెలంగాణ 14.22, హర్యానా 12.91, బీహార్ 11.6, చత్తీస్ ఘర్ 9.54, అరుణాచల్ ప్రదేశ్ 1.09 లక్షల ఓట్లు ఫ్రాడ్ జరిగినట్లు సదరు సంస్థ తెలిపిందని అంటున్నారు.

ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.