వైసీపీ నేతలకు చెంపలు అప్పగించేస్తున్న లోకేష్!

రాజకీయాలంటే కేవలం అడ్డగోలు విమర్శలు, శృతిమించిన తిట్లు, విజ్ఞత మరిచిన పోస్టులు, సంస్కారం మరిచిన చర్యలు అని మాత్రమే అనుకుంటే ఎలా.. అని ప్రజలు ప్రశ్నిస్తున్న కాలమిది. కారణం… జనం బాగా అప్ డేట్ అయిపోయారు. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరి పాలన ఎలా ఉంది.. మాటలకు చేతలకూ తేడా ఎంత ఉంది అనే అంశాలు గమనిస్తున్నారు. అయితే ఆ విషయం మరిచి కొంతమంది నేతలు ప్రవరిస్తున్నారు.

ఇందులో భాగంగా గతకొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అవి సబ్జెక్ట్ తో కూడిన విమర్శలేనా.. ఆయనకు ఫుల్ అవగాహన ఉండి చేస్తున్న విమర్శలేనా అని ఆలోచిస్తే మాత్రం కాదనే అర్ధం వస్తుంది. కారణం… ప్రభుత్వంపైనా, మంత్రులపైనా లోకేష్ విమర్శలు చేస్తున్నారు. అనంతరం సంబంధిత శాఖా మంత్రులు మైకులముందుకు వచ్చి క్లారిటీ ఇస్తున్నారు.

ఆ విమర్శలు పూర్తి అవాస్తవాలు అని ఖండిస్తూ… ఘణాంకాలు బయట పెడుతున్నారు.. గతంలో టీడీపీ ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ కడిగేస్తున్నారు. పనిలో పనిగా ఈ విషయాలపై చర్చకు రావాలని లోకేష్ – చంద్రబాబులకు సవాల్ విసురుతున్నారు. ధమ్ముంటేనే.. చీమూ నెత్తురూ ఉంటేనే అంటూ కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు!!

ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీపై లోకేష్ చేసిన కామెంట్లపై మంత్రి విడదల రజని స్పందించారు. ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌ కు లేదని మండిపడ్డారు. ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తు.. దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్‌ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఇదే క్రమంలో… గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మొదలుపెట్టిన రజనీ… ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌ పై ఉంచిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీని డాక్టర్ వైఎస్సార్ తీసుకొస్తే… తాజాగా ఆ పథకంలో 3257 ప్రొసీజర్స్‌ ను చేర్చిన ఘనత సీఎం జగన్‌ దని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని.. ఫలితంగా ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహించారని గుర్తుచేసిన విడదల రజనీ… వైఎస్ జగన్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టిన విషయాని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో గడిచిన నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీపై 10,100 కోట్లు ఖర్చుపెట్టినట్లు రజనీ క్లారిటీ ఇచ్చారు.

అయితే మంత్రి రియాక్షన్ పై లోకేష్ మాత్రం తిరిగి స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇది లోకేష్ కి ఇదే మొదటి సారి కాదు. పాదయాత్రలో భాగంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు లోకేష్. దీంతో అనిల్ కుమార్.. లోకేష్ ను దుయ్యబడుతూ కొన్ని ఛాలెంజ్ లు చేశారు. మంత్రి కాకాణి కూడా లోకేష్ విమర్శలపై స్పందిస్తూ.. చీమూ నెత్తురూ ఉంటే చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. కానీ… చినబాబు నుంచి నో రెస్పాన్స్!!

దీంతో… లోకేష విమర్శలకు క్రెడిబిలిటీ లేకుండా పోతోందని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది!