Vasi reddy Padma: గత వైకాపా ప్రభుత్వంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ టీడీపీ, జనసేన పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఈమె వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడు అదే పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.
ఈమె గత ఎన్నికలలో వైకాపా పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లోనే ఈమె పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలను పద్మ ఖండించారు. ఇక గత ఎన్నికలలో వైకాపా ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతో మంది కీలక నేతలు ఈ పార్టీ నుంచి తప్పుకొని ఇతర పార్టీలలోకి వెళ్లారు అయితే తాజాగా వాసిరెడ్డి పద్మ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారని సమాచారం.
ఇదే విషయం గురించి ఈమె మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నానని ఇటీవల కేసినేని చిన్నితో సమావేశమై ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలా తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్న వాసిరెడ్డి పద్మా వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించారనీ, వైసీపీ అధ్యక్షుడు ఎవరో మీరు నిర్ణయించుకోండి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
గత ఎన్నికలలో వైసీపీని ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో అవి కూడా దక్కవు అంటూ ఈమె వ్యాఖ్యానించారు. వైసిపి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఈ పార్టీలో ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాను అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని స్కాములలో జగన్ ప్రమేయం ఉందని వాటికి కారణం జగనే అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై వైకాపా అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నాను: వాసిరెడ్డి పద్మ
విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నితో మాజీ మహిళా కమిషనర్ భేటి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టుపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
ఏపీకి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించారు. వైసీపీ అధ్యక్షుడు ఎవరో మీరు నిర్ణయించుకోండి అంటూ కౌంటర్
జగన్ ను… pic.twitter.com/Gfmmx5TTvg
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024