కత్తి సాముతో విన్యాసాలు చేసిన అందాల భామ (వీడియో)

తమిళంలో ప్రతినాయిక పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. త్వరలో నాగకన్య చిత్రంలో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఐలవ్ యూ చెప్పాల్సి వస్తే ప్రభాస్ కే చెబుతానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం రాజపర్వాయి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో కత్తితో విన్యాసాలు చేసే సీన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో పెట్టింది. ప్రస్తుతం ఇంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోని క‌రెక్ట్ టైంలో చిత్రీక‌రించిన నా హెయిర్ డ్రెస్స‌ర్‌ శ్రీధర్‌కి ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్‌లో తెలిపింది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.

https://twitter.com/varusarath/status/1104250060156485632