బ‌న్నీ షూటింగ్ లో ఫేమస్ హీరోయిన్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అల‌నాటి అందాల తార ట‌బుని ఎంపిక చేశారు. ఆమె రీసెంట్‌గా టీంతో క‌లిసింది. వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలిపింది చిత్ర బృందం.

టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Welcome Aboard Tabu Garu - Ala Vaikunthapuramulo Team | Allu Arjun, Pooja Hegde | Trivikram