సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సమంత తన అందంతో మాత్రమే కాకుండా విలక్షణమైన నటనతో కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇలా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా వెబ్ సీరీస్ లలో నెగిటివ్ రోల్స్ చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో నిత్యం బిజిగా ఉండే సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకి 2 నుండి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఇలా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా
రూ 500 తో సమంత కి మంచి అనుబంధం ఉంది. ఈ విషయం గురించి ఇటీవల సమంత బయటపెట్టింది.
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సమంత అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ముచ్చట్లు పెడుతుంది. ఈ క్రమంలో రూ.500 ఉన్న అనుబంధం గురించి బయటపెట్టింది. సినిమాలలోకి రాకముందు సమంత మోడలింగ్ లో అడుగు పెట్టింది. అయితే అంతకన్నా ముందు హయ్యర్ సెకండ్రీ స్కూల్ చదివే సమయంలో సమంత ఒక ఈవెంట్‌లో అతిథులను ఆహ్వానించే పనికి వెళ్లింది. ఆ ఈవెంట్ లో పని చేసినందుకు సమంత తీసుకున్న మొదటి జీతం రూ.500. ఈ విషయాన్ని సమంత తన అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు రూ.500 జీతం తీసుకున్న సమంత ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.