తమన్నాకి ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం బహుమతి గా ఇచ్చిన స్టార్ హీరో వైఫ్?

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమా సూపర్ హిట్ అవటంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంది నటి తమన్నా. ఈ క్రమంలో టాలివుడ్ లో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికీ ఈమె డిమాండ్ తగ్గటం లేదు. ఇటీవల తెలుగులో తమన్నా నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

ఇలా 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ వందల కోట్ల రూపాయలను తమన్నా కూడబెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల తమన్నా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచంలో వజ్రాలను అత్యంత విలువైనవి గా భావిస్తారు. అలాంటి అరుదైన వజ్రం తమన్నా సొంతం అయ్యింది. ప్రపంచంలోనే 5వ పెద్ద వజ్రం తమన్నా దక్కించుకుంది. దీని విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు. అయితే ఇంతటి విలువైన వజ్రాన్ని ఒక స్టార్ హీరో భార్య తమన్నాకి బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. ఆమె ఎవరు కాదు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. ఉపాసన ఈ అరుదైన వజ్రాన్ని తమన్నాకి బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ 15 సంవత్సరాల లో తమన్నా దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్లు సమాచారం. ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్‌మెంట్‌ తో పాటు రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్‌ కారు, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్‌ రోవర్ రేంజ్ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్స్‌, రూ. 43.50 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల విలువ గల మిత్సుబిషి పేజర్‌ స్పోర్ట్స్‌ కార్లు తమన్నా తో ఉన్నాయని సమాచారం. ఇక తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా శీతకాలం’ తో పాటు ‘భోళా శంకర్’ చిత్రంలో కూడా నటిస్తోంది.