వారాహి రెండవ దశ యాత్ర ఎప్పుడో హింట్ ఇస్తున్న చంద్రబాబు!

ఏపీలో గత రెండు వారాలుగా రాజకీయాలు ఫుల్ సందడి సందడిగా కొనసాగాయి. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన రోజు నుంచి వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలతో సందడే సందడి నెలకొంది. అయితే ఈ నెల 30న భీమవరం సభతో ఆ సందడి మిస్ అవ్వబోతోంది. వారాహి యాత్రకు విరామం ప్రకటించారు పవన్ కల్యాణ్.

అయితే వారాహి యాత్ర తిరిగి ఎప్పుడు మొదలవ్వబోతోంది.. రెండో దశ ఎప్పుడు ఉండబోతోంది అంటే ఆ విషయం చంద్రబాబు చెప్పబోతున్నారు. అవును… ఈ నెల 14 నుంచి జనసేన యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడా సభలు పెట్టలేదు. ఆయన కుప్పంలో మాత్రం పర్యటించి అనంతరం పార్టీ కార్యక్రమాలు చేసుకున్నారు. జనాల్లోకి మాత్రం రాలేదు.

ఇది మీడియా అటెన్షన్ మొత్తం పవన్ వారాహియాత్రపైనే ఉండాలని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారా.. లేక, పవన్ తో అండర్ స్టాండింగ్ లో భాగంగా ఇద్దరం ఒకేసారి జనాల్లో వద్దు.. నువ్వు బిజీగా ఉన్నపూడు నేను, నేను బిజీగా ఉన్నప్పుడూ నువ్వు అనే ఒప్పందంలో భాగంగా సైలంట్ గా ఉన్నారో తెలియదు కానీ… పవన్ తొలి విడత యాత్ర ముగిసిన అనంతరం చంద్రబాబు రోడ్డెక్కనున్నారు.

అవును… జూన్ 30న పవన్ వారాహియాత్రకు బ్రేక్ ఇస్తుంటే జూలైలో చంద్రబాబు జిల్లాయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే పవన్ వారాహి యాత్ర టైం లో బాబు జనంలో లేరు. వారాహి యాత్ర పూర్వ్వగానే జనంలోకి వస్తున్నారు. దీంతో పైకి విడివిడిగా కనిపిస్తున్నా, పొత్తు ఉండొచ్చు ఉండక పోవచ్చు అనే కబుర్లు చెబుతున్నా… తెలుగుదేశం – జనసేనల మధ్య ఈస్థాయిలో అవగాహన ఉందని అంటున్నారు పరిశీలకులు.

దీంతో… చంద్రబాబు జిల్లాల టూర్ పూర్తయిన తర్వాత వారాహి యాత్ర రెండో షెడ్యూల్ ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. అంటే చంద్రబాబు జిల్లా టూర్స్ కి సంబంధించిన షెడ్యూల్ బయటకు వస్తే… ఆ లోపు అయితే వారాహి యాత్ర ఉండదనే విషయం కన్ ఫాం అయిపోద్దని అంటున్నారు.

మరి ఈ జిల్లాల యాత్రల్లో చంద్రబాబు కూడా గోదావరి జిల్లాల్లో కూడా పర్యటిస్తారా.. లేక, పవన్ పర్యటించిన నియోజకవర్గాలను మాత్రం పక్కనపెట్టి మిగిలిన నియోజకకవర్గాలు కవరయ్యేలా టూర్ ప్లాన్ చేస్తున్నారా అన్నది వేచి చూడాలి. దీంతో పవన్ ఎప్పటికీ బాబు మనిషే అనే కామెంట్లు ఆన్న్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. ఈ విషయం తెలియక జనసైనికులు హడావిడి చేస్తుంటారని.. తెలిసినవారు పవన్ సినిమా అభిమానులుగా మాత్రమే ఉంటున్నారని అంటున్నారు.