చంద్రబాబు ఓవర్ కామెంట్స్… అదేమాట వాలంటీర్లు అంటే?

గత ఐదారు రోజులుగా ఏపీలో వాలంటీర్లు వర్సెస్ పవన్ కల్యాణ్ అనే రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ శృతిమించి వ్యాఖ్యానిస్తున్నారని అంటే… అంతకు మించి శృతిమించారు చంద్రబాబు. నోరు జారిన ఫలితం ఒకదఫా చూశాక కూడా బాబుకు జ్ఞానోదయం రాలేదా అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం.

వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నాలుగు రోజులుగా ఏం మాట్లాడాలో తెలియ‌క‌ మౌనంగా ఉండిపోయిన చంద్రబాబునాయుడు…తాజాగా పవన్ తో పాటు సై అంటూ వలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడ‌టం మొదలుపెట్టారు. తాజాగా “మహిళాశక్తి” కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ.. వాలంటీర్లపై నోరుపారేసుకున్నారు.

అవును… చెప్పుతో కొట్టేవాళ్ళు లేక వాలంటీర్లు రెచ్చిపోతున్నారంటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీతాలు పెంచమని అడిగిన తిరుమల కొండమీద పనిచేసే నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తామని వ్యాఖ్యానించారు. ఫలితంగా ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో బీసీ లంతా కలిసి బాబు తోక కత్తిరించినంత పనిచేశారు.

అయినా కూడా జ్ఞానం రాలేదో.. లేక, ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లడం ఇంగితం కోల్పోతున్నారో తెలియదు కానీ… ప్రజల ఇళ్ళల్లోకి వాలంటీర్లు చొరబడుతున్నారంటూ ఊగిపోయారు చంద్రబాబు. మగవాళ్ళు లేనప్పుడు వాలంటీర్లు ఇళ్ళల్లోకి ఎందుకు వస్తున్నారంటు నిలదీశారు. తంలో కూడా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వలంటీర్లు వచ్చి ఆడవాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

అనంతరం చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో… ఆ విషయాలపై బాబు నోటికి తాళం వేసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవసను కొనసాగిస్తామన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆయన పుత్ర రత్నం లోకేష్తో కూడా అలాంటి వాగ్ధానాలే చేయించారు!

మళ్ళీ ఇంతకాలానికి మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే… చంద్రబాబుకు కూడా ఊపొచ్చినట్లుంది. అందుకనో ఏమో విజ్ఞత మరిచి నోరుపారేసుకుంటున్నారు. ఇదే సమయంలో… రాష్ట్రంలో 22,278 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయినట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయని ఆరోపిస్తున్నారు చంద్రబాబు.

14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, 40 ఏళ్ల రాజకీయానుభవం కింద పెట్టుకున్న చంద్రబాబు కూడా… ఇలా తప్పుడు లెక్కలు చెబుతుండటంతో ఫైరవుతున్నారు వైసీపీ నేతలు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే గడచిన రెండేళ్ళలో కిడ్నాపులు, అపహరణల కేసుల్లో ఏపీ 18వ స్ధానంలో ఉంది.

గడచిన రెండేళ్ళల్లో ఈ పద్ధ‌తిలో నమోదైన కేసులు కేవలం 870 మాత్రమే అని కేంద్ర హోంశాఖ చెబుతుంటే చంద్రబాబేమో 22 వేల మంది కనబడటంలేదని, పవనేమో 18 వేల మంది మిస్సింగని చెప్పటంలో వారి అజ్ఞానం బయటపడుతుందని అంటున్నారు.

ఈ సందర్భంగా… చెప్పుతో కొట్టేవాళ్ళు లేక వాలంటీర్లు రెచ్చిపోతున్న మాటకు… చెప్పుతో కొట్టేవాళ్లు లేక చంద్రబాబు – పవన్ లు తప్పుడు లెక్కలు చెబుతూ, పిచ్చిగా వాగుతున్నారని ఫైరవుతున్నారంట వాలంటీర్లు. దీంతో… పెద్దలు విజ్ఞత మరిస్తే… పిల్లలు మరువరా అని గుర్తుచేస్తున్నారంట పరిశీలకులు.