నిన్న-మొన్నటి వరకూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తసిన వంశీ ఇప్పుడు యూ టర్న్ దిశగా అడుగులు వేస్తున్నాడా? మళ్లీ పసుపు తీరం వైపు గాలులు వీస్తున్నాయా? అంటే అవుననే బలమైన సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ అటుపై చంద్రబాబు పై ఎటాక్ కి దిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడ్ని..ఆయన కుమారుడు లోకేష్ ని ఓ రేంజ్ లో విమర్శించారు. అధికారికంగా వైసీపీలోకి చేరకపోయినా ఆ పార్టీకి మద్దతిచ్చినట్లే వ్యవహరించారు. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనని ఆకాశానికి ఎత్తేయడం..దమ్మున్న నాయకుడంటూ మీడియా మందు చంద్రబాబుకు సవాళ్లు చేయడం జరిగింది.
ఆయన వెంట మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కూడా ఉండటంతో వంశీకి పార్టీలో తిరుగులేని స్థానం కట్టబెట్టే అవకాశం ఉందని మీడియా కథనాలు వేడెక్కించాయి. వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే వైసీపీ అదిష్టానం ఆయనకే టిక్కెట్ ఇచ్చి బరిలో దించుతారని ప్రచారం సాగింది. అయితే ఇదే సమయంలో గన్నవరం వైసీపీ క్యాడిండేట్ దుట్టా రామచంద్రరావు… వంశీ స్పీడ్ కు బ్రేకులు వేసే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డిపైనే అసహనాన్ని వ్యక్తం చేసారు. టిక్కెట్ ఇస్తే తనకే ఇస్తారని…వైసీపీ కి నియోజక వర్గంలో పునాదులు వేసింది తానేనని ప్రోజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసారు.
ఈ నేపథ్యంలో గన్నవరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వంశీ వర్గీయులు-దుట్టా వర్గీయులు మధ్య అంతర్గత పోరు తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడు వైసీపీ క్యాడర్ తో వంశీకి ఏం జరిగిందో ఏమో! ఉన్నట్లుండి జగన్ మోహన్ రెడ్డిపై అసహనాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసారు. 151 సీట్లతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డిని ఓ సామాన్యుడిలా తీసేసే ప్రయత్నం చేసినట్లు వ్యాఖ్యానించారు. రాజీనామాకు భయపడుతున్నారా? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా నేను జగన్ గాలిని తట్టుకుని గెలిచిన వాడిని..ఇప్పుడొక లెక్కా! అన్నటు మాట్లాడారు. నియోజక వర్గంలో ఉంటే ఒక్కడే ఉండాలి అన్నారు. దీంతో వంశీ అసహనానికి కారణంగా వైసీపీ క్యాడర్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాడర్ దుట్టాని ప్రోత్సహించినంతగా వంశీని వెనకేసుకురావడం లేదని..అందుకే ఇలా ఓపెన్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.