బిజెపి పాలనలో ప్రజాసంస్థలు భ్రష్టుపట్టాయి- ఉత్తమ్ కుమార్ రెడ్డి

సిబిఐ లో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సిబిఐ కార్యాలయాల ముందు నిరసనలు తెలపాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏఐసిసి పిలుపు మేరకు టిపిసిసి నేతలంతా హైదరాబాద్ కార్యాలయాల వద్ద నిరసనలో పాల్గొన్నారు. 

నిరసనలో అఖిలపక్ష నేతలు

నిరసనలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేసి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు ప్ర‌జాధ‌నం దోపిడి జ‌రుగుతోంద‌ని, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని, న‌రేంద్ర‌మోడీ చేతుల్లో రాజ్యాంగం ఆవిర‌య్యే ప‌రిస్థితి వచ్చిందని నేతలన్నారు.

అందుకోసమే ఈ రోజు ఈ నిర‌స‌న చేప‌ట్టామ‌న్నారు. అర్ధ‌రాత్రి 2.00 గంట‌ల‌కు సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్‌వ‌ర్మను ఉన్న ఫ‌లంగా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించి మ‌రోక‌రిని నియ‌మించ‌డం అనేది రాజ్యాంగ విరుద్ద‌మ‌న్నారు. దేశంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేతల వీడియో కింద ఉంది చూడండి. 

 

congress protest