దొంగ పాస్ పోర్ట్, దొంగ వీసాల్లో ఎక్ప్పర్ట్ కేసీఆరే (వీడియో)

జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్, భట్టి, రేవంత్ సునీతా లక్ష్మారెడ్డి ఇతర నేతలు సోమవారం అర్ధరాత్రి మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కుందన్ బాగ్ లోని డిజిపి ఇంటికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని ఉత్తమ్ అన్నారు. పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ కేసీఆర్ ఏజంట్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, హారీష్ రావుల పైనా నకిలీ పాస్ పోర్టు కేసులు ఉన్నాయని వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డిని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్బందించినట్టు తెలుసుకొని కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

kcr is expert on fraud pass ports