ఓహో.. చంద్రబాబు పంట పండుతోందన్నమాట. చంద్రబాబు కోరికలు నెరవేరబోతున్నాయన్నమాట. ఏంటో.. ఈ మధ్య చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. చంద్రబాబు దశ మళ్లీ తిరిగినట్టుంది. అందుకే.. చంద్రబాబుకు అన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. చంద్రబాబు మొక్కులన్నీ ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్న టీడీపీకి కొత్త ఊపిరి అందుతోంది.
నిజానికి టీడీపీ పార్టీకి రోజురోజుకూ గడ్డుకాలం ఎదురవుతోంది. పార్టీకి బలమైన రాష్ట్రం ఏపీలో దాని పట్టు రోజురోజుకూ కోల్పోతున్నదని వస్తున్న వార్తలకు చెక్ పెట్టే వార్త వచ్చేసింది.
అవే జమిలి ఎన్నికలు. అంటే.. ఒక దేశంలో ఒకే ఎన్నిక. అంటే రాష్ట్రాల వారీగా ఎన్నికలు నిర్వహించడం.. రాష్ట్రాల వారీగా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం.. ఇదంతా కాదు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక. ఇది బీజేపీ నినాదం. ఇప్పుడే కాదు.. చాలా ఏళ్ల నుంచి బీజేపీ జమిలి ఎన్నికల కోసం పోరాడుతోంది.
2014లోనే బీజేపీ జమిలి ఎన్నికలను దేశవ్యాప్తంగా తీసుకురావడం కోసం ప్లాన్ ను సిద్ధం చేసుకున్నది. 2018లో భారత్ మొత్తం జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కోరుకున్నప్పటికీ.. అప్పుడు అది జరగలేదు. అన్ని రాజకీయ పార్టీల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవడంతో జమిలి ఎన్నికలు కార్యరూపం దాల్చలేదు.
కానీ.. ఇప్పుడు రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. దీంతో జమిలి ఎన్నికల అంశాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. దీని మీద మళ్లీ కేంద్రం చర్చలు జరుపుతున్నదట.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు వృధా కాదు. రిగ్గింగ్ కు చాన్స్ ఉండదు. పార్టీల ప్రలోభాలు కుదరవు. ఐదేళ్ల పాటు ఎవరి పాలన వాళ్లు చేసుకునే అవకాశం ఉంటుంది.. లాంటి అంశాలతో బీజేపీ రంగం సిద్ధం చేస్తోందట.
అయితే.. ఇది అంత సులువుగా అయ్యే పనికాదు. దీని కోసం రాజ్యాంగంలో సవరణ చేయాలి. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటే దేశమంతా ఒకేసారి ఓటింగ్ ఉంటుంది. ఒకే ఓటింగ్ విధానం ఉండాలి. అందుకే… రాజ్యాంగంలో సవరణల కోసం బీజేపీ అన్నింటినీ సమాయత్తం చేస్తోందట.
ఇదంతా ఓకే అయిపోతే… 2022లో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందట. దేశమంతా 2022 లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చంద్రబాబుకు కావాల్సింది. ఎందుకంటే… సాధారణ ఎన్నికలు రావాలంటే ఇంకా 4 ఏళ్లు ఆగాలి. అంటే 2024 దాకా ఆగాలి. కానీ.. జమిలి ఎన్నికల వల్ల 2022లోనే ఎన్నికలు వస్తే.. చంద్రబాబుకు శుభవార్తే కదా. అసలే అధికారం లేక చంద్రబాబుకు ఏం తోయటం లేదు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయంటే వెంటనే రంగం సిద్ధం చేసుకొని.. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినా పెట్టేస్తారు. అయితే.. జమిలి ఎన్నికలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇబ్బందే. రాకరాక అధికారంలోకి వస్తే.. దాన్న పూర్తిగా అనుభవించకముందే మూడేళ్లకే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా? అన్న సందిగ్దంలో వైఎస్ జగన్ ఉన్నారట.