అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన

అమరావతి అదిరింది. అమరావతి ని ఆడిపోసుకున్నోళ్లంతా తలదించుకునేలా ప్రజలు అమరావతి అదరించారు. అందుకే అమరావతి బ్యాండ్లు సూపర్ హిటయ్యాయి.

చంద్రబాబు అమరావతిని కట్టడం లేదు, రాజధాని పనులు సరిగా జరగడం లేదు అంటూ పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ రాజధాని నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అమరావతి బాండ్లను రిలీజ్ చేసింది.   అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. హాట్ కేక్స్ లా అమ్ముడు బోయాయి. సబ్ స్రైబర్లు ఎగబడ్డారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో అమరావతి బాండ్లు ఊహించని రీతిలో కొనుగోలు అయ్యాయి. సుమారు ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయి. ఈ మేరకు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

అమరావతి నిర్మాణ నిధులు సేకరించటానికి ప్రభత్వం అమరావతి షేర్లను అమ్మకానికి పెట్టింది. 13,00 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లకు విశేషంగా గంటలో 2000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. 4 సంవత్సరాలలో రాజధాని అభివృద్ధికి కేంద్రం నుండి ౧౫౦౦ కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి. కానీ సీఆర్డీఏ గంటలోనే రెండు వేల కోట్ల రూపాయలు సేకరించగలిగింది. చంద్రబాబు, రాజధాని అమరావతిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇది నిదర్సనం అంటూ ఆయన ట్వీట్ చేశారు.