గుంటూరు టిడిపికి భారీ షాక్ ?

తెలుగుదేశంపార్టీ ఘోర పరాజయం తర్వాత కొందరు నేతల చూపు బిజెపి వైపు మళ్ళిందని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. గుంటూరు జిల్లాలోని సీనియర్ నేతలు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు ప్రముఖులు బిజెపిలో చేరటానికి రెడీ అవుతున్నారంటూ ఇటు బిజెపి అటు టిడిపిలో చర్చ జరుగుతోంది. తమ పై ఉన్న కేసులతో ఇబ్బందులు పడకుండా ఉండటం కోసమే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గడచిన ఐదేళ్ళల్లో ఇద్దరు నేతలు ఆకాశమే హద్దుగా అవినీతిలో చెలరేగిపోయారని టిడిపిలోనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఇద్దరిపైన రాష్ట్ర, కేంద్రప్రభుత్వ ఏజెన్సీలు కేసులు కూడా నమోదు చేశాయి. ఒకరిపై కేసులు కోర్టులో విచారణ జరుగుతోంది. మరొకరి కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ రెండు కేసుల్లో విచారణ పూర్తయితే శిక్షలు ఖాయమన్నది అర్ధమైంది.

మళ్ళీ టిడిపినే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే అడ్డదిడ్డమైన అవినీతికి పాల్పడ్డారట. కానీ ఊహించని రీతిలో కేసుల్లో ఇరుక్కున్నారు. దానికితోడు ఇపుడు అధికారం కూడా పోయింది. దాంతో వాళ్ళిద్దరికీ కేసుల భయం పెరిగిపోయింది. టిడిపిలోనే ఉంటే నిండా ముణిగిపోవటం ఖాయమని అర్ధమైపోయిందిట.

అందుకనే కేసుల నుండి తమను తాము రక్షించుకోవటంలో భాగంగా వెంటనే బిజెపిలో చేరిపోతే కేసుల నుండి రక్షణ లభిస్తుందని అనుకుంటున్నారట. ఎలాగూ వైసిపిలోకి వెళ్ళలేరు కాబట్టి బిజెపిలో చేరటం ఒక్కటే శరణ్యం వాళ్ళకి. సమీప భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నారట. అందుకనే బిజెపి వైపు చూస్తున్నారు. మరి కేసులున్న వాళ్ళని బిజెపి చేర్చుకుని రక్షిస్తుందా ? చూడాల్సిందే.