పవన్ ముందు రెండే ఆప్షన్లు… వాట్ టు డూ – వాట్ నాట్ టు డూ?

ఒకప్పుడు పవన్ ముందు చాలా ఆప్షన్లు ఉండేవి. బీజేపీతో కలిసి వెళ్తారా.. టీడీపీతో మాత్రమే వెళ్తారా.. రెండు పార్టీలను కలుపుకుని వెళ్తారా.. లేక, ఒంటరిగా వెళ్తారా.. అదీగాక, కమ్యునిస్టులతో కలిసి వెళ్తారా.. కాకపోతే కేసీఆర్ కోరుకుంటున్నారన్నట్లుగా బీఆరెస్స్ తో జతకడతారా.. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉండేవట. అయితే ఇప్పుడు పవన్ కు ఓన్లీ టూ ఆప్షన్స్ అని అంటున్నారు పరిశీలకులు.

ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా అక్కడే ఉన్నారు. మంగళవారం సమావేశం అయిపోయిన తర్వాత బుధవారం ఉదయం ఏపీ ఇన్‌చార్జి మురళీధరన్‌ తో భేటీ అయిన ఆయన… రాత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా పవన్ ఢిల్లీలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే అది మోడీ అపాయింట్మెంట్ కోసం అని అంటున్నారు.

అయితే పవన్ ఎవరి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసినా, ఇప్పటికే ఎంతోమదిని కలిసినా… అదంతా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదన దిశగానే జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పవన్ పై ఉన్న బృహత్కర భాధ్యత అదే అని అంటున్నారట. నాదెండ్ల మనోహర్ ని ఇచ్చి పవన్ ను హస్తినకు బాబు అందుకే పంపారనేది మరో కామెంట్!

ఆ సంగతి అలా ఉంటే… పవన్ చేస్తోన్న ప్రతిపాదనకు బీజేపీ పెద్దలెవరూ సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తుంది. పైగా… ఎన్ డీఏ సమావేశానికి ఒక్క ఎంపీ కూడా లేని జనసేనలాంటి పలు పార్టీలను పిలిచిన బీజేపీ పెద్దలు… నలుగురు ఎంపీలున్న టీడీపీని ఆహ్వానించలేదు. అప్పుడైనా బీజేపీ ఆలోచనపై పవన్ కు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి అని అంటున్నారంట పరిశీలకులు. ఇంతకంటే క్లియర్ గా పవన్ కు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారంట.

దీంతో ఇక తేల్చుకోవాల్సింది పవనే అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏపీలో జగన్ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ఏపీ బీజేపీ పెద్దలు చెబుతున్నారు. కానీ పవన్ మనసులో మరో ఆప్షన్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఒక క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.

దీంతో ఇక పవన్ ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. అందులో ఒకటి… టీడీపీని వదిలి బీజేపీ పెద్దలు చెప్పినట్లు వారితోనే కలిసి ఎన్నికలకు వెళ్లడం కాగా… మరొకటి.. బీజేపీని లైట్ తీసుకుని, మోడీకి బై బై చెప్పి బాబు సైకిల్ ఎక్కేయడం. మరి పవన్ వీటిలో ఏ ఆప్షన్ ఎంచుకోబోతున్నారు అనేది ఢిల్లీ టూర్ అయిన తర్వాత అతి తొందరలోనే తెలిసిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

అయితే వీటిలో ఏది బెస్ట్ ఆప్షనో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట విశ్లేషకులు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే మరికొంతకాలం జనసేన బ‌తికి బట్టకట్టే అవకాశముందని అంటున్నారంట. అలాకాకుండా వెంటిలేటర్ పై ఉన్న టీడీపీతో కలిస్తే జనసేన భవిష్యత్తు అనుమానమే అని అభిప్రాయపడుతున్నారంట.

కారణం… 2024 ఎన్నికల్లో జనసేన + బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లినా పక్షంలో… ఓడిపోయినా కూడా జనసేన మనుగడకు వచ్చిన ప్రమాధం ఏమీ లేదు! కానీ… టీడీపీ + జనసేన రూపంలో ఎన్నికలకు వెళ్తే… గెలిస్తే ఓకే కానీ, ఒకవేళ ఓడిపోతే మాత్రం టీడీపీతో పాటు జనసేన కూడా ఉనికి కోల్పోవ‌డం ఖాయం కావడమే!!