ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. పవన్, బాబులకు ఎన్టీఆర్ షాకిస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందరివాడు అనిపించుకోవాలని అనుకుంటున్న తారక్ ఏదైనా పార్టీకి అనుకూలంగా మాట్లాడితే తనపై విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అమిత్ షాతో తారక్ భేటీ వల్ల ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రావొచ్చనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో తెలివైన వ్యక్తి అనే సంగతి తెలిసిందే.

అయితే ఎన్ని తెలివితేటలు ఉన్నా తారక్ చంద్రబాబు చేతిలో ఒకసారి దెబ్బ తిన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం తారక్ కృషి చేసినా చంద్రబాబు తారక్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అమిత్ షాతో తారక్ భేటీ వల్ల పవన్, చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. రాజకీయాల గురించి చర్చించాలనే ఆలోచనతోనే బీజేపీ ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

చంద్రబాబును ఇప్పటికే నమ్మి బీజేపీ కూడా ఒకసారి మోసపోయింది. పవన్ కళ్యాణ్ ను నమ్మడం వల్ల పెద్దగా లాభం ఉండదని బీజేపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తారక్ ఒకరు. తారక్ కు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయాల్లో ఉన్నారు. మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ఏపీ ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేయగలరు.

రాబోయే ఎన్నికల్లో సైతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. తారక్ బీజేపీకి ఎక్కడ మద్దతు ఇస్తాడో అని ఇప్పటికే ఎల్లో మీడియా తారక్ కు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తోంది. తారక్ మేనత్త పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఒక్క మీటింగ్ తోనే తారక్ టీడీపీ, జనసేన అధినేతలను టెన్షన్ పెడుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.