పరీక్ష తేదిలను ప్రకటించిన టిఎస్ పీఎస్సీ

తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలకు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను టిఎస్ పీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 13 వ తేది నుంచి డిసెంబర్ 17 వ తేది వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్ టి విధానంలో పరీక్షలు జరుగుతాయని టిఎస్ పీఎస్సీ సెక్రటరీ వాణి ప్రసాద్ తెలిపారు. హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. పరీక్షల షెడ్యూల్  ఈ విధంగా ఉంది. పరీక్షలన్నీ డిసెంబర్ లోనే జరుగనున్నాయి.

శానిటరీ ఇన్ స్పెక్టర్ పోస్టుకు – 13 వ తేది పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

15 వ తేది – పేపర్ 2 బయోలాజికల్ సైన్స్ 2.30 నుంచి 5 గంటల వరకు  

అసిస్టెంట్ డైరీ మేనేజర్ గ్రేడ్ 2 పోస్టుకు- 13 వ తేది, పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

అసిస్టెంట్ క్వాలిటి కంట్రోల్ ఆఫీసర్ పోస్టుకు- 14 వ తేది, పేపర్  (డైరీయింగ్ డిగ్రీ లెవల్ ) ఉదయం 10 నుంచి 12.30 వరకు

ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టుకు- 13 వ తేది పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

ప్రాసెసింగ్ సూపర్ వైజర్ పోస్టుకు – 14 వ తేది పేపర్ 2 డెయిరీ టెక్నాలజీ- మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు 13 వ తేది, పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

డెయిరీ డెవలప్ మెంట్ పోస్టుకు  15 వ తేది పేపర్ 2 కెమిస్ట్రీ, డిగ్రీ లెవల్ ఉదయం 10 నుంచి 12.30 వరకు

మార్కెటింగ్ అసిస్టెంట్ ఇన్ డెయిరీ పోస్టుకు , 13 వ తేది పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

16 వ తేది ,పేపర్ 2 మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఉదయం 10 నుంచి 12.30 వరకు

సూపర్ వైజర్ ఇన్ డెయిరీ పోస్టుకు 13 వ తేది పేపర్ 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్) మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

మార్కెటింగ్ పోస్టుకు  16 వ తేది పేపర్ 2 మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఉదయం 10 నుంచి 12.30 వరకు

హెల్త్ అసిస్టెంట్  పోస్టుకు 13 వ తేది  పరీక్ష జనరల్ నాలెడ్జీ, బయోలాజికల్ సైన్స్ ఉదయం 10 నుంచి 12.30 వరకు

ఫీల్డ్ అసిస్టెంట్పోస్టుకు  (డెయిరీ)- 13 వ తేది జనరల్ నాలెడ్జ్, బయలాజికల్ సైన్స్ ఉదయం 10 నుంచి 12.30 వరకు

ప్లాంట్ ఆపరేటర్ పోస్టుకు  (డెయిరీ)- 16 తేది జనరల్ నాలెడ్జ్, మెకానికల్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ పోస్టుకు  2 17 వ తేది జనరల్ నాలెడ్జ్ ఉదయం 10 నుంచి 12.30 వరకు

ప్రాసెసింగ్ సూపర్ వైజర్  పోస్టుకు 17 వ తేది డెయిరీ డిప్లొమా లెవల్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు

ఈ పరీక్షలు జరుగుతాయని టిఎస్ పీఎస్సీ తెలిపింది. మరిన్ని వివరాలకు టిఎస్ పీఎస్సీ వెబ్ సైట్ ను చూడాలని అధికారులు తెలిపారు.