Home Andhra Pradesh తెలంగాణా.. పాకిస్థానా? కామెంట్ : పవన్ పై పోలీస్ కేసు

తెలంగాణా.. పాకిస్థానా? కామెంట్ : పవన్ పై పోలీస్ కేసు

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం భీవమరం సభలో మాట్లాడుతూ… తెలంగాణా.. పాకిస్థానా?, అంటూ సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కళ్యాణ్‌పై కేసు నమోదు అయ్యింది.

రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

పవన్ మాట్లాడుతూ… ”విభిన్న సామాజికవర్గాలు, మతాల పేరుతో మనలోమనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా… తెలంగాణ వారికి మాత్రం మనం ఆంధ్రులం” అని ఆయన అన్నారు.

“జనసేనలో చేరాలనుకున్న నాయకులను టీఆర్‌ఎస్ నేతలు భయపెట్టి వైసీపీలో చేరేలా చేశారు. జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది కానీ, ఆయనంటే నాకు భయం లేదు. తెలంగాణలో ఉన్న నా ఇంటిని, పదెకరాల భూమిని లాక్కుంటారా? ఏం… తెలంగాణ పాకిస్తాన్‌ అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి ఏపీ రాజకీయాలను మార్చేస్తారా?” అని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Posts

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

మంత్రులు ఇరుక్కుంటున్నారా లేక ఎవరైనా ఇరికిస్తున్నారా ?

వైసీపీ మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హైలెట్ అవుతూ ఉంటారు.  సీజన్ ప్రకారం ఈ టైమ్ ఒకరు ఈ టైమ్ ఇంకొకరు అంటూ వార్తలూ నిలుస్తూ వస్తున్నారు. టైం టేబుల్ వేసుకున్నట్టు ఒక్కొక్కరిగా వార్తలకెక్కుతున్న...

చౌదరిగారిని డోంట్ కేర్ అంటున్న తెలుగు తమ్ముళ్లు 

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చాలామంది సీనియర్  నాయకులు బరిలో నిలిచారు.   వారిలో కొద్దిమంది మాత్రమే గెలుపొందారు.  వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడ ఒకరు. ఈయన పార్టీలో చాలా...

కుప్పంలో ‘పవర్ కట్’ పాలిటిక్స్ … వైసీపీ పై టీడీపీ ఫైర్ !

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షు చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబును...

Latest News