క్రియేటివిటీకి, వెటకారానికి లిమిట్స్ లేవంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో బోలెడు పోస్ట్ లు ఉంటాయి కదా? ఇందులో వింతేముందంటారా? అన్ని పోస్టులందూ ఈ పోస్టు వేరని అంటున్నారు మరి నెటిజన్లు! ఈ పోస్టులో… ఒకే ఫోటోలో కాషాయ వస్త్రాలు ధరించిన పవన్ కల్యాణ్, నిత్యానంద, చంద్రబాబు ఉన్నారు!
విషయానికొస్తే… జనసేన 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో బ్రహ్మాండంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అశేష ప్రజానికం ఆ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. తనకు కులమతాలు లేవని చెబుతూ.. గుర్రం జాషువా రాసిన కొన్ని లైనలు చదువుతూ.. తనను తాను విశ్వనరుడిగా ప్రకటించుకున్నారు. తనకు కులం మతం లేవని, విశ్వనరుడని చెప్పుకుంటూనే.. మరోవైపు ప్రసంగం అంతా ప్రధానంగా తాను కాపు కులస్తుడినని, ఆదరించాలని.. కాపులు పెద్దన్నపాత్ర పోషించాలని, ఏకులంతోనూ కాపులు వేడుకున్నారు పవన్ కల్యాణ్.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో పాటు పవన్ దృష్టిలో సమర్ధుడిగా స్థానమున్న చంద్రబాబు.. కైలాస ద్వీపం అధినేత, వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు నిత్యానందతో పోల్చుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే ఇది! విశ్వనరుడిగా పవన్ కల్యాణ్, ప్రపంచ మేధావిగా చంద్రబాబు ఫోటోలు పెట్టిన ఈ పోస్ట్ లో.. వీరిద్దరి మధ్యలో కైలాస అధినేత నిత్యానంద ఫొటోలు పెట్టిన ఈ వ్యంగ్య పోస్టు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉన్న ఈ ముగ్గురిని చూస్తూ…. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని “సరిపోయారు ముగ్గురూ” డైలాగ్ ని సీనియర్ నటి రోహిణి అంటున్నట్టుగా ఓ కామెంట్ కూడా పెట్టారు.
ఈ పోస్టులో పవన్ కల్యాణ్ కాషాయ వస్త్రధారణలో ఉండగా… నిత్యానంద, చంద్రబాబులు వారి వారి రెగ్యులర్ కాస్ట్యూంస్ లో ఉన్నారు.