రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు ఆమోదం
ముస్లిమ్ సమాజానికి చెందిన కీలక పరిణామం ఇది. వివాహ వ్యవస్థను అవహేళన చేస్తూ ఒకటికి మించి ఇష్ఠానుసారం పెళ్లిల్లు చేసుకునే వీలును కల్పించే `ట్రిపుల్ తలాక్` వ్యవస్థ రద్దు కానుంది. ఆ మేరకు రాజ్యసభలో నేడు ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. ఇటీవలే లోక్ సభలోనూ ఈ బిల్లు పాస్ అయ్యింది. అంతకుముందు సుప్రీం కోర్టు సైతం ట్రిపుల్ తలాక్ ని రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే బిల్లు అమల్లోకి వచ్చినట్టే.
ఇంతకీ ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు ఆమోద యోగ్యమా? అంటే 99 శాతం మంది అనుకూలంగా ఓటేయగా.. 84 శాతం మంది వ్యతిరేకించారని ఓ చానెల్ సర్వే వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ రద్దు వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నాయకులు ఈ బిల్లుకు అనుకూలం అని ప్రకటించినా.. బిల్లులోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. అయితే దేశ ప్రధాని మోదీ దీనిని సమర్థిస్తూ తన ఆమోదాన్ని తెలిపారు. ముస్లిమ్ మహిళల ఆత్మ గౌరవం పెంచడానికే ఈ రద్దు నిర్ణయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇక ఈ బిల్లుకు రాజ్యసభ సభ్యుడు వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డి వ్యతిరేకంగా ఓటేశారు. మరో ఇద్దరు వైకాపా ఎంపీలు అనారోగ్యంతో సభకు హాజరు కాలేకపోవడంతో ఓటు వేయడం వీలుపడలేదు. ప్రస్తుతం ఈ ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుపై యువతరంలో వాడి వేడిగా చర్చ సాగుతోంది.