ఆ పార్టీలకు జాతి ప్రయోజనం కన్నా రాజకీయమే మిన్న ?

ఆ పార్టీలకు జాతి ప్రయోజనం కన్నా రాజకీయమే మిన్న ?

మంగళవారం నాడు రాజ్య సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందటంతో దేశంలో వున్నముస్లిం మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు . అయితే ఈ బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది . ఇక టీఆరెస్ , తెలుగు దేశం పార్టీ , వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ , అన్నాడీఎంకే , జెడియు ,బి ఎస్ పి , పి డి .పి మొదలైన పార్టీలో సభ నుంచి బయటకు వెళ్లిపోయాయి . ఈ పార్టీలకు జాతి ప్రయోజనం కన్నా తమ రాజకీయ ప్రయోజనం , ఓటు బ్యాంకు ముఖ్యమైపోయాయి .

నిజానికి ట్రిపుల్ తలాక్ బిల్లును 2017లోనే లోక్ సభ ఆమోదించినా రాజ్య సభలో తగినంత బలం లేకపోవడంతో అప్పట్లో నెగ్గలేదు . అయితే ఈ సారి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో మంగళవారం నాడు రాజ్య సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది . రాజ్య సభలో మొత్తం సభ్యుల సంఖ్య 240, ఎన్డీయే లో 107 మంది మాత్రమే వున్నారు . తలాక్ బిల్లు ఆమోదం పొందాలనే 121 మంది కావాలి . అయితే మంగళవారం రోజు సభలో 183 మంది సభ్యులున్నారు . అందులో 99 మంది ఎన్డీయే వారున్నారు . కాబట్టి ట్రిపుల్ తలాక్ బిల్లు సులభంగా ఆమోదం పొందింది .

ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్య సభ ఆమోదించిందని తెలుసుకున్న ముస్లిం మహిళలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే అనేక ముస్లిం దేశాలు ఈ ఆచారానికి స్వస్తి పలికాయి . ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఆనందాన్ని పంచుకున్నారు . ట్రిపుల్ తలాక్ అనాగరిక ఆచారం , మధ్య యుగాలనాటి ఈ దురాచారాన్ని చివరికి చెత్త బుట్టలో కి వెళ్ళిపోయింది . శతాబ్దాల క్రితం ముస్లిం మహిళలు విషయంలో చేసిన తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్దింది అని మోడీ పేర్కొన్నారు .అంతేకాదు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాజంలో సమానత్వానికి లభించిన గొప్ప విజయమని మోడీ అభివర్ణించారు .