చంద్రబాబు పంచన ఉంటూ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తాడనుకుంటే జగన్ గూటికి చేరాడు, ఇదేం రాజకీయం!

YSRCP and TDP flags

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చూడనటువంటి దాయనీయమైన స్థితికి చేరుకుంది. విభజన తరువాత చంద్రబాబు నాయుడు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం వల్ల తెలంగాణలో ఎలాగో టీడీపీ పార్టీ భూస్థాపితం అయిన విషయం తెలిసిందే. అయితే రానున్న మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ భూస్థాపితం కానుందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిందే అతి తక్కువ సీట్లు అందులోను కొంతమంది వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెల్లకపోయిన వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.

అలాగే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు పార్టీలోని బీసీ కీలక నేతల్లో ఒకరైన పల్లా శ్రీనివాసరావు కూడా వైసీపీ చెంతకు చేరనున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఆయన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.

పవన్ కళ్యాణ్ కోసం బాబు చేసిన త్యాగం

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ముఖ్య కారణమేమిటంటే చంద్రబాబు నాయుడుకు తాను గెలవాలనే కోరిక కంటే కూడా వైసీపీ ఓడించాలనే తపనే ఎక్కువ ఉండేది. అందుకే ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రయత్నించకుండా వైసీపీ ఓటమి కోసం ప్రయత్నించి చంద్రబాబు నాయుడు బొక్కబోర్లా పడ్డాడు. పల్లా శ్రీనివాస రావు గాజువాక నుండి పోటీ చేస్తున్నప్పుడు అదే ప్రాంతం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేశారు. వైసీపీ నేతను ఓడించాలనే తపనతో వ్యూహాత్మకంగా అక్కడ పోటీని వైసీపీకి, జనసేనకు వదిలేశారు. ఎందుకంటే అక్కడ వైసీపీ తరపున నిలబడ్డ తిప్పాల నాగిరెడ్డిని ఓడించలేమని బాబుకు తెలుసు. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ కు బాగా ప్రజల ఆదరణ ఉందని కూడా తెలుసు, అందుకే ఇప్పుడు తాను కూడా ఇక్కడ ప్రచారం చేసి పవన కళ్యాణ్ కు పోటీగా నిలబడి ఓట్లను చీల్చకుండా మొత్తం వైసీపీని ఓడించి బాధ్యత జనసేనపైనే పెట్టాడు. కానీ వైసీపీ నేత తిప్పాల నాగిరెడ్డి పవన్ కు కూడా ఓడించారు.

పల్లా శ్రీనివాసరావు నిర్ణయం సరైనదేనా!

ఒకరకంగా చూస్తే పార్టీ మారాలనుకున్న పల్లా శ్రీనివాసరావు యొక్క నిర్ణయం సరైనదేనని అనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో గాజువాకలో ప్రచారం కోసం చంద్రబాబు నాయుడుని పల్లా శ్రీనివాసరావు అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అక్కడి ప్రచారం కోసం వెళ్ళలేదు. పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడి కనీస బాధ్యత కానీ వైసీపీ ఓడించాలనే ఉద్దేశంతో ఒక రకంగా పల్లా శ్రీనివాసరావు అపజయాన్ని చంద్రబాబు నాయుడే కోరుకున్నట్టు ఉంది. ఇలా చంద్రబాబు చేసిన పని వల్లే తాను ఒడిపోయానని భావించిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ గూటికి చేరాలనుకుంటున్నారు. అయిన రాజకీయల్లో పార్టీలు మారడం అనేది చాలా చిన్న విషయం. దాని కోసం ఇంత పెద్ద ఆర్టికల్ రాసేంత రిజన్స్ ఉండాలనుకోవడం మన మూర్ఖత్వం.