‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ యుఎస్ టాక్: హైలెట్ సీన్స్ ఇవే !

abn rk losing journalistic values in kothapaluku

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకూ రకరకాల సమస్యలను ఫేస్ చేసింది. అదే విధంగా ఉచిత పబ్లిసిటిని, హైప్ ని పొందింది. లాస్ట్ మినిట్ లోనూ ఈ సినిమాకు ట్విస్ట్ పడింది. ఈ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేక్‌ వేసింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా చోట్ల ఎక్కడైనా ఈ సినిమా రిలీజ్ కావచ్చు. అదే జరుగుతోంది ఈ రోజు. ఇప్పటికే యుఎస్ లో షోలు పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న రిపోర్ట్ ని మీకు అందిస్తున్నాం.

అమెరికాలో ఈ సినిమా చూసిన వారు చెప్పిన దాని ప్రకారం…ఈ సినిమాని పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ నట జీవితం కాని, మరొకటి కానీ ముట్టుకోకుండా లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా ..ఓ విధంగా ఆమె వెర్షన్ గా వర్మ తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలు.. లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబం దూరమైన విధానం.. చంద్రబాబు నాయుడు చేసిన మోసం.. ఇవే ప్రధాన కథాంశాలుగా చేసుకుని వర్మ ఈ సినిమాలో చూపటం జరిగింది.

అలాగే ఈ సినిమా టైటల్ కార్డ్ లోనే జనాలకు కిక్ ఇచ్చారు వర్మ. ‘స్పెషల్ ధాంక్స్ టు బాలయ్య’ అనే టైటిల్ కార్డ్ వేసారు. అది చూసిన జనం ధియోటర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. దానికి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచే జనం ఎలర్ట్ అయ్యి..ఇలాంటి చమక్కులు కోసం ఎదురుచూడటం మొదలెట్టారు. అలాగే మోహన్ బాబు పాత్రకు సైతం సినిమా లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మోహన్ బాబుకు ,చంద్రబాబు నాయుడుకు గత కొద్ది రోజలుగా ఫీజులకు ఎపిసోడ్ జరగటం తో జనం బాగా కనెక్ట్ అయ్యారు.

సినిమాలో భాగంగా.. మోహన్ బాబు వచ్చి ఎన్టీఆర్ ని కలిసి తనకు ఓ సినిమా చేయమని అడగటంతో మేజర్ చంద్రకాంత్ చిత్రం తెరకెక్కుతుంది. అయితే మోహన్ బాబు క్యారక్టర్ గెటప్, క్యారక్టరైజేషన్, డైలాగ్స్ చెప్పే విధానంపై శ్రద్ద తీసుకున్నట్లులేవు. అవి కొంతవరకూ నవ్వులు పాలయ్యాయి.

ఇక అదే చంద్రకాంత్ వంద రోజుల పంక్షన్ లో స్టేజీపై ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేసారు. అదే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటాననటం. అదే ఇంటర్వెల్. అలా లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ వివాహ ఎపిసోడ్ లో మోహన్ బాబు తెలియకుండానే ముఖ్యపాత్రధారి అయ్యారు. ఇలా సినిమాలో చాలా భాగంగా తెలిసిన విషయాలనే హైలెట్ చేస్తూ తెరకెక్కించారు వర్మ.