ఆర్టికల్ 370 రద్దులో కీలక వ్యక్తులు

జమ్మూ కాశ్మీర్ కు దశాబ్దాలు పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దులో ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటూ ఉంటారు. తెర వెనుక ఉంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను మోడి సమర్ధవంతంగా నడిపించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసే బిల్లును  ప్రవేశపెట్టింది సోమవారమే అయినా దాని వెనుక జరిగిన తతంగాన్ని మాత్రం మొన్నటి ఎన్నికలకు ముందే మొదలుపెట్టారు. రెండోసారి అధికారంలోకి రాగానే చేయాల్సిన పనులను మోగి, షా ధ్వయం ముందే ఓ అజెండాను తయారుచేసి పెట్టుకున్నారు. వారు అనుకున్నట్లే రెండోసారి కూడా మంచి మెజారిటితో అధికారంలోకి రాగానే తమ అజెండాను అమల్లోకి తేవటం మొదలుపెట్టారు.

అజెండాలో ప్రాధాన్యత అంశం ఏమిటంటే అమిత్ షా ను కేంద్ర హోం శాఖ మంత్రిని చేయటం. తర్వాత 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రమణ్యంను జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరిగి నియమించటం. ఈ రెండు వ్యవహారాల తర్వాత క్షేత్రస్ధాయిలో పరిస్దితులను భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యక్షంగా పర్యవేక్షించటం. ఇందుకోసం దోవల్ పలుమార్లు కాశ్మీర్ లో పర్యటించారు. తర్వాత బిల్లుకు న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవటం.

క్షేత్రస్ధాయిలో దోవల్  అధ్యయనం పూర్తవ్వగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో బిల్లును రెడీ చేశారు. దోవల్ సలహా ప్రకారమే దాదాపు 10 వేలమంది మిలిటరీ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ లోని అన్నీ మూలల దింపేశారు.  ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడటం, టెర్రరిస్టులు రెచ్చిపోకుండా చూడటమే మిలిట్రి పని. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరుగుతున్నాయని నివేదిక రాగానే కేంద్రం బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది.